RRR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. అక్కడక్కడా ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తోన్న ఒక తెలుగు వాడైన రాజమౌళి.. బాహుబలి తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు.ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చూసి క్రిటిక్స్‌తో పాటు ఇతర హీరోల అభిమానులు అందరు ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తున్నారు. రాజమౌళి.. తను అనుకున్న స్క్రిప్ట్‌ను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన విధానం చూసి ఆశ్యర్యపోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలను ఈ సినిమాను కథ చెప్పకుండానే ఓకే చేయించడం బహుశా జక్కన్నకు తప్ప మరో దర్శకుడు ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.
ఇక ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా చూసిన పలువురు సినీ హీరోలు, దర్శకులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సినిమాను ప్రశంసల ఝల్లుతో ముంచెత్తున్నారు. ఈ కోవలో దక్షిణాదిలో రాజమౌళి కంటే తన సినిమాలతో అలరించిన దర్శకుడు శంకర్.. ఆర్ఆర్ఆర్ మూవీపై తనదైన శైలిలో స్పందించారు.
Ravishing,Riveting,Robust.A Roar that’ll echo throughout times.Thanks to the whole team for an unparalleled experience.@AlwaysRamCharan-Raging Performance & Screen presence.@tarak9999 ‘s Radiant Bheem captivates your heart.Ur imagination stays undefeated,hats off “MahaRaja”mouli.
— Shankar Shanmugham (@shankarshanmugh) March 25, 2022
రాజమౌళి కంటే భారతీయ సినిమా స్టాండర్డ్స్‌ను ఇంటర్నేషనల్ లెవల్లో టచ్ చేసిన శంకర్.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చూసి మెచ్చుకున్నారు. RRR కు ఒక కొత్త అర్ధాన్ని ఇస్తూ ప్రేక్షకులు మరుపురాని అనుభూతి ఇచ్చిన రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సినిమాలో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఎన్టీఆర్ ఎమోషనల్ పర్ఫామెన్స్ నిలిచిపోతాయన్నారు. రాజమౌళి మీ ఊహాశక్తికి హాట్సాఫ్ అంటూ మెచ్చుకున్నారు. మరోవైపు శంకర్.. తన కెరీర్‌లో మొదటి సారి తెలుగులో డైరెక్ట్‌గా రామ్ చరణ్‌తో నెక్ట్స్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రభుత్వ అధికారిక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు తెలుగులో ‘సర్కారోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Jr NTR : RRR సక్సెస్‌తో ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో ఏ హీరోలకు సాధ్యం కాలేదు..
ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. గతంలో తెలుగులో బాహుబలి మూవీ సెట్ చేసిన అన్ని రికార్డులను స్మాష్ చేసేలా ఉందని ఈ సినిమా బుకింగ్స్ ఓపెనింగ్స్ చెబుతున్నాయి. పైగా నందమూరి, మెగా కాంబినేషన్‌ను ఒకే తెరపై చూసించి రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చూసారు. పైగా నాలుగేళ్ల కష్టం ఈ సినిమాలో కనిపించింది. మొత్తంగా ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఓ చరిత్రను సృష్టించడం ఖాయం అంటున్నారు.
RRR First Day Collections : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రికార్డులన్ని గల్లంతేనా.. ?
ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Kollywood, Rajamouli, Ram Charan, RRR, RRR Movie Review, Shankar, Tollywood