హోమ్ /వార్తలు /సినిమా /

పాకిస్థాన్‌కు వర్మ వార్నింగ్.. మీరు ఒక్కరిని చంపితే.. మేము నలుగురిని చంపుతాం..

పాకిస్థాన్‌కు వర్మ వార్నింగ్.. మీరు ఒక్కరిని చంపితే.. మేము నలుగురిని చంపుతాం..

రాంగోపాల్ వర్మ (ఫైల్ ఫొటో)

రాంగోపాల్ వర్మ (ఫైల్ ఫొటో)

రామ్ గోపాల్ వర్మ చూస్తే తింగరోడులా ఉంటాడు కానీ..అపుడపుడు ఆయన చేసే ట్వీట్స్ నిజమేగా అనిపిస్తాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ.. మొన్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ట్విట్టర్ సాక్షిగా కడిగిపారేసాడు. తాజాగా మరోొసారి పాక్‌కు తనదైన శైలిలో చురకలు అంటించాడు.

ఇంకా చదవండి ...

ఈ నెల 14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు కాశ్మీర్‌లోని పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడిలో కన్నుమూసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది.

మంగళవారం తెల్లవారుఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 300 మంది ముష్కరులు హతమైనట్టు సమాచారం.
భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్‌పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఓరేయ్ తుమ్ ఏక్ మారేతో..హమ్ చార్ మారేంగే.. తెలుగులో చెప్పాలంటే.. మీరు మాలో ఒక్కడ్నిచంపితే..మేము నలుగురిని చంపుతాం అంటూ ట్వీట్ చేసాడు. రామ్ గోపాల్ వర్మ దుష్ట పాకిస్థాన్‌పై చేసిన ఈ కామెంట్స్‌ను నెజిజన్లు మెచ్చుకుంటున్నారు.

First published:

Tags: Pm modi, Pulwama Terror Attack, Ram Gopal Varma, Surgical Strike 2, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు