ఎన్టీఆర్, ఏఎన్నార్‌ మధ్యలో రామ్ గోపాల్ వర్మ.. మహానటుల మధ్య తుంటరి ఆర్జీవి..

ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మధ్యలో రామ్ గోపాల్ వర్మ (ఫేస్‌బుక్ ఫోటో)

NTR ANR Ram Gopal Varma | తెలుగు సినిమాకు రెండు కళ్ల లాంటి వారైనా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో రామ్ గోపాల్ వర్మ ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
తెలుగు సినిమాకు రెండు కళ్ల లాంటి వారైనా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో రామ్ గోపాల్ వర్మ ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికొస్తే.. ఆయన సంచలనాలకు మారు పేరు. నిత్యం ఏదో  వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. అతడు మాట్లాడినా  సంచలనమే... మాట్లడక పోయినా  సంచలనమే. మొత్తానికి వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. తనకు నచ్చితే సినిమా తీస్తాడు. నచ్చకపోయినా సినిమా తీస్తాడు. సినిమా తీయడమే శ్వాసగా బతుకుతూ ఇండియన్ ‘హిచ్ కాక్ ’ పేరు సంపాదించాడు.  అంతేకాదు అప్పటి వరకు ఒక మూసలో పోతున్న తెలుగు చిత్రాన్ని తన ‘శివ’ సినిమాతో పూర్తిగా మార్చేసాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలంటే శివకు ముందు.. శివకు తర్వాత అనేంతలా తనదైన మార్క్ క్రియేట్ చేసిన జీనియస్ రామ్ గోపాల్ వర్మ. అలాంటి వర్మ.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఉన్న కలిసి ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటో .. అప్పటి నంది అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా తీసినది.

akkineni nagarjuna ram gopal varmas sensational shiva movie completed 30 years,‘శివ’ సినిమా విడుదలై నేటికి ముప్పై ఏళ్లు పూర్తైయిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ.. నాగార్జునకు ఉద్దేశిస్తూ.. ఈ రోజు మన బిడ్డకు 30 ఏళ్లు అంటూ ట్వీట్ చేసాడు.ram gopal varma,rgv,ram gopal varma twitter,ram gopal varma instagram,ram gopal varma facebook,ram gopal varma nagarjuna shiva 30 yerars,ram gopal varma nagarjuna shiva 30 yerars completed,30 years nagarjuna akkineni shiva,nagarjuna twitter,nagarjuna instagram,nagarjuna facebook,the journey of ram gopal varma,ram gopal varma shiva,the journey of ram gopal varma live,ram gopal varma movies,shiva to vangaveeti - journey of ram gopal varma live,journey of ram gopal varma live,shiva to vangaveeti,ram gopal varma shiva movie,shiva movie,shiva,ram gopal varma speech,ram gopal varma death,ram gopal varma movie,ram gopal varma interview,ram gopam varma,శివ,ముప్పై ఏళ్ల శివ,30 ఏళ్ల శివ మూవీ,నాగార్జున శివ మూవీకి ముప్పై ఏళ్లు,రామ్ గోపాల్ వర్మ,నాగార్జున,నాగార్జున రామ్ గోపాల్ వర్మ శివ 30 ఏళ్లు,30 ఏళ్ల శివ మూవీ,
నాగ్,ఆర్జీవిల ‘శివ’ సినిమాకు ముప్పై ఏళ్లు..


అప్పట్లో తొలి సినిమా శివతోనే రామ్ గోపాల్ వర్మ.. ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేతులు మీదుగా వర్మ ఈ అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈ అవార్డు ప్రోగ్రామ్‌లో ఏఎన్నార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాను అక్కినేని నాగేశ్వరరావు చిన్నబ్బాయి నాగార్జున హీరోగా నటిస్తే.. పెద్దబ్బాయి.. అక్కినేని వెంకట్‌తోె పాటు ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో అక్కినేని పెద్దల్లుడు యార్లగడ్డ సురేంద్ర ఈ  చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమాను అప్పట్లో నాగార్జున, అమల హీరో, హీరోయిన్లుగా అదే శివ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తే అక్కడా కూడా ఈ సినిమా హిట్టైయింది.స్వతహాగా రామ్ గోపాల్ వర్మ..తాను ఎన్నోసార్లు ఎన్టీఆర్ అభిమానిగా చెప్పుకొన్నాడు. అంతేకాదు ఆయన నటించిన అడవి రాముడు సినిమాను ఎన్నోసార్లు చూసానో లెక్కేలేదు అంటూ చెప్పిన సందర్భాలున్నాయి. ఇక వర్మ తన అభిమాన నటుడి చేతి నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక వర్మ.. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య ఆయన జీవితంలో తెరకెక్కించకుండా మిగిలిపోయిన భాగాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published: