ఏపీ పోలీసులు సంపూర్ణేష్ బాబులా కామెడీ చేయకూడదు.. వర్మ ట్వీట్..

Ram Gopal Varma |రామ్ గోపాల్ వర్మ..  ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. తాజాగా ఈయన ఏపీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై స్పందించాడు.

news18-telugu
Updated: March 22, 2020, 7:22 AM IST
ఏపీ పోలీసులు సంపూర్ణేష్ బాబులా కామెడీ చేయకూడదు.. వర్మ ట్వీట్..
రామ్ గోపాల్ వర్మ (Twitter/Photo)
  • Share this:
రామ్ గోపాల్ వర్మ..  ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. ఎపుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. అంతేకాదు తనకు గిట్టని వాళ్లపై ఏదో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు ముందు నుంచి అలవాటు. తాజాగా ఏపీలోని పార్వతి పురం పోలీసులు కరోనా పై అవగాహన కల్పిస్తూ.. రాములో రాములా పాటకు డాన్స్ చేస్తూ ఉన్న వీడియోను పోస్ట్ చేసి పోలీసులకు కాస్త క్లాస్ పీకాడు.  సమాజానికి దిశా నిర్ధేశం చేసే పోలీసులు ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. సమాజంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ సంపూర్ణేష్ బాబులా కామెడీ చేయకూడదు అంటూ వర్మ తన  ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్‌లో ఏపీలోని పార్వతి పురం పోలీసులు.. వాళ్ల ఉన్నతాధికారి వచ్చి షేక్ హ్యాండ్ కోరితే.. వాళ్లు మాత్రం షేక్ హ్యాండ్ బదులు నమస్తే చెప్పాలంటూ..  అక్కడున్న పోలీసులు రాములో రాములా పాటకు డాన్స్ చేస్తూ.. కరోనా నుంచి ఎలా స్వీయ రక్షణ పాటించాలో చెప్పారు. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. రజినీకాంత్ ఉద్దేశించి మరో పోస్ట్ ట్వీట్ చేసాడు.కరోనా వైరస్‌ను అంతం చేయడానికి రజినీకాంత్ ఏమి చేయడం లేదందకు.. జస్ట్ ఆస్కింగ్ అంటూ అడిగాడు. మరోవైపు కరోనా వైరస్ అందరినీ ఒక్కలాగే చూస్తుంది. షారుఖ్ లాంటి హీరో నుంచి ఫ్లాఫ్ హీరో వరకు.. ప్రధాన మంత్రి నుంచి బెగ్గర్ వరకు.. అందగత్తెల నుంచి మాములు ప్రజలకు వరకు అందరినీ ఒక్కలాగే చూస్తుంది. కరోనా పై మన దేవుళ్లు ఏమి  చేయడం లేదా దేవాయాలు, మసీదులు, చర్చిల వరకు అన్నింటినీ ఈ వైరస్ కారణంగా మూసేసారు. కరోనా వైరస్ మాములు ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా పెద్ద గుణపాఠం నేర్పిందంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.Published by: Kiran Kumar Thanjavur
First published: March 22, 2020, 7:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading