ఏపీ ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లలా ? అసెంబ్లీ సమావేశాల తీరుపై వర్మ సంచలన ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం..వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల ముందు  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రాము.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల వైఖరిపై తనదైన  శైలిలో వరుస ట్వీట్ లు పెడుతూ సెటైర్లు వేశారు.

news18-telugu
Updated: June 18, 2019, 5:07 PM IST
ఏపీ ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లలా ? అసెంబ్లీ సమావేశాల తీరుపై వర్మ సంచలన ట్వీట్..
రాంగోపాల్ వర్మ (File)
news18-telugu
Updated: June 18, 2019, 5:07 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం..వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల ముందు  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక వైసీపీ అధికారంలోకి రావడానికి తనవంతుగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీసి చంద్రబాబు నాయుడు తీరును తనదైన శైలిలో ప్రజల ముందు ఉంచడంలో దాదాపు సపలీకృతమయ్యాడు వర్మ. తాజాగా రాము.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల వైఖరిపై తనదైన  శైలిలో వరుస ట్వీట్ లు పెడుతూ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తన, స్పీకర్ ల పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేయడానికి స్పీకర్ బెల్ మ్రోగిస్తున్నారని వర్మ ట్వీట్ చేశారు.అసెంబ్లీ సమావేశాలు అంటే ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఒకరినొకరు బెదిరించుకోవడం కోసమా లేక ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ గురించి చర్చించడానికా? అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. అసెంబ్లీలో స్పీకర్ గంట మోగిస్తుంటే తనకు స్కూల్ లో బెల్ గుర్తుకొస్తోందన్నారు.

ఏ రకంగా చూసిన ఎమ్మెల్యేల ప్రవర్తన స్కూల్ పిల్లల మాదిరి ఉందని కామెంట్ చేశారు. ఈ ట్వీట్లపై ఆయన ఫాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Loading...కొందరు ప్రస్తుతం జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాల తీరు పై స్పందిస్తూ గత ప్రభుత్వ అక్రమాలు ప్రజలకు తెలియవు. ఈ చర్చలు వల్ల ఆ అక్రమాలు ప్రజలకు చేరతాయన్నారు. మరికొందరు వేరే రకంగా స్పందించారు. మొత్తానికి వర్మ తన ట్వీట్‌తో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...