ఎపుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేసే రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి మాత్రం మంచు లక్ష్మిని టార్గెట్ చేసాడు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచిన వర్మ.. తాజాగా మంచు లక్ష్మిని టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. మన దేశంలో కూడా ఈ మహామ్మారి మనందరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అంతేకాదు ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీంతో పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి సామాన్యులకు వరకు అందరు ఇంటికే పరిమితమయ్యారు. అత్యవరస సేవలు చేసే పోలీస్, డాక్టర్లు,మీడియా, పారిశుద్ధ్య సిబ్బంది వంటి వారు ప్రాణాలకు ఎదురొడ్డి మరి ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఇంట్లో ఉండటంతో ప్రజలు ఏం చేయాలో తోచక టిక్‌టాక్‌లు చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు.
Taking a break from the coronavirus can anybody tell me who the little girl is imitating??? pic.twitter.com/aKDB1TZJ7e
— Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2020
ఈ క్రమంలో ఓ పాప, తన అమ్మతో చేసిన ఓ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ చిన్నపాప వాళ్ల అమ్మ మిల్క్ తాగుతావా అని అడిగితే.. ఆ పాప మంచు లక్ష్మీని ఇమిటేట్ చేస్తుంది. ఈ వీడియోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేస్తూ.. కరోనా నుంచి కాస్తా విరామం తీసుకొండి. ఈ పాట ఎవరో తెలిస్తే నాకు చెప్పండి అంటూ వర్మ ట్వీట్ చేసాడు. ఇక వర్మ ట్వీట్ చేసి మంచు లక్ష్మీ సార్ అంటూ ట్వీట్ చేసింది. దీనికి మరో నెటిజన్ సర్ర్ కాదు ఆర్ షుడ్ బీ రోలింగ్ అంటూ కాస్త సరదగా కామెంట్ పెట్టాడు. అంతేగాక లక్ష్మీని ఇమిటేట్ చేస్తున్న మరికొన్ని టిక్‌టాక్ వీడియోలను అభిమానులను షేర్ చేస్తున్నారు. ఎపుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియని రామ్ గోపాల్ వర్మ.. మంచు లక్ష్మీని టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక మంచు లక్ష్మీ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘దొంగల ముఠా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఇక మంచు ఫ్యామిలీతో ‘రౌడీ’, ‘అనుక్షణం’ ‘ఎటాక్’ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా.
Sarrr 😅😂
— Lakshmi Manchu (@LakshmiManchu) March 29, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Lakshmi, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood