Home /News /movies /

SENSATIONAL DIRECTOR RAM GOPAL VARMA COMMENTS ON SRIDEVI TA

వర్మ పిచ్చి పీక్స్‌కు వెళ్లిందిగా.. దివంగత శ్రీదేవి కోసం ఏం చేసాడంటే..

రామ్ గోపాల్ వర్మ, శ్రీదేవి (File Photos)

రామ్ గోపాల్ వర్మ, శ్రీదేవి (File Photos)

వివాదాస్పద దర్శకుడు రామ్  గోపాల్ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం. తాజాగా వర్మ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి సంచలనానికి వేదికగా నిలిచాడు.

    వివాదాస్పద దర్శకుడు రామ్  గోపాల్ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం. ఈ యేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో వర్మ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. మొన్నటి మొన్న ‘బ్యూటిఫుల్’ ఆడియో‌లో డాన్సులు గట్రా చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తాజాగా ‘బ్యూటిఫుల్’ ఆడియో వేడుకలో పలువురు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు అంతే కొంటేగా సమాధానాలు ఇచ్చాడు ఆర్జీవి. సినిమాలు, వోడ్కా...  ఈ రెండింట్లో దేన్ని ఒదిలేస్తారు.. అంటే నేను వోడ్కా తాగుతూ.. సినిమాలు తీస్తా.. అలాగే సినిమాలు తీస్తూ వోడ్కా తాగుతా.. నా దృష్టిలో ఆ రెండూ మ్యారీడ్ అన్నారు.ఇక మీ బయోపిక్‌ను నెగిటివ్‌‌గా తీస్తే ఏం సమాధానం ఇస్తారనే ప్రశ్నకు.. నేను ఎవరి సలహాలు సూచనలతో బయోపిక్ తీయలేదు. నేను చంద్రబాబు నాయుడిని అడగలేదు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని అడగలేదు. నాకు ఐడియా వచ్చి తీసేశాను. అలా తీయగలిగే స్వేచ్ఛ అందిరికీ ఉండాలన్నారు. కాబట్టి నా బయోపిక్ తీయాలంటే నన్ను అడగకుండా తీయండంటూ సమాధానమిచ్చాడు.

    ram goapl varma latest dance video go viral on social media,ram Gopal Varma,ram Gopal Varma Twitter,ram gopal Varma Instagram,ram gopal varma dance,ram gopal varma,ram gopal varma,amma rajyamlo kadapa biddalu,beautiful audio,ram gopal varma naina ganguly,ram gopal varma acting debut,ram gopal varma sensational decision,ram gopal varma lakshmis ntr,ram gopal varma lakshmi's ntr,ram gopal varma cobra,cobra movie,tollywood,Telugu Cinema,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్,రామ్ గోపాల్ వర్మ ఇన్‌స్టాగ్రామ్,రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు,రామ్ గోపాల్ వర్మ బర్త్ డే స్పెషల్,పుట్టినరోజున రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం,యాక్టింగ్ చేస్తోనంటోన్న రామ్ గోపాల్ వర్మ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,లక్ష్మీస్ ఎన్టీఆర్,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ డాన్స్ వీడియో
    రామ్ గోపాల్ వర్మ (Youtube/Photo)


    మరోవైపు ఒక నెటిజన్..శ్రీదేవి బయోపిక్ తీసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా అని అడిగాడు. దానికి వర్మ.. శ్రీదేవిపై ఎలాంటి బయోపిక్ తీయను. అసలు శ్రీదేవి లాంటి అమ్మాయి దొరకడం అసాధ్యం అనే చెప్పాలి. ఆమె బయోపిక్ తీసే ఐడియానే లేదన్నాడు. ఇక సినిమాలకు సమాజానికి ఎపుడు దూరంగా ఉంటారు అన్న ప్రశ్నుకు వర్మ.. నువ్వు చచ్చినపుడు నేను నువ్వు చెప్పినట్టుగానే సినిమాలకు, సమాజానికి దూరంగా ఉంటానని దిమ్మ దిరిగే సమాధానమిచ్చాడు. ఇది జరిగేటపుడు నువ్వు ఉండవు కాబట్టి ఇపుడే నేను నీకు నివాళులు అర్పించేస్తానన్నారు.. జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్లే రెండే రెండు అంశాలు అమ్మాయి గ్లామర్. రెండోది మగాడి పవర్. ఆఖరికి ఒక నెటిజన్.. మీరు మరో గంటలో చనిపోతున్నారని తెలిస్తే.. ఏం చేస్తారనే ప్రశ్నకు .. స్వర్గంలో నాకు తెలిసినవారందరికీ ఫోన్ చేసి  శ్రీదేవి సమాధి ఎక్కడుందో తెలుసుకొని ఆమె పక్కనే నాకు స్థలం ఖాళీగా ఉంచమని చెప్తాను అంటూ ఆసక్తికర సమాధానమిచ్చారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ram Gopal Varma, Sridevi, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు