కీర్తి సురేష్‌ లుక్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..

కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తోన్న ఓ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దీనిపై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 19, 2019, 10:24 AM IST
కీర్తి సురేష్‌ లుక్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
Twitter
  • Share this:
కీర్తి సురేష్‌.. తెలుగులో రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ.. నాని ‘నేను లోకల్’ సినిమాలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి ’లో నటించింది. అయితే మహానటి సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం లభించింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో  నాగార్జున ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'పెంగ్విన్' సినిమాలో నటిస్తోంది.


అది అలా ఉంటే..కీర్తి ఇటీవలే తన 27వ పుట్టినరోజున జరుపుకుంది. ఈ సందర్భంగా కీర్తి నటిస్తోన్న ఓ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నగేష్ కకునూర్ దర్శత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన కీర్తి లుక్‌పై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా రాస్తూ.. కీర్తి లుక్‌కు ఫిదా అయ్యానని.. ఆ లుక్‌లో కీర్తి అదిరిపోయిందని.. విభిన్న కథలతో కీర్తి  అదరగొడుతోందని తెలుపుతూ చిత్ర బృందానికి తన విషేష్‌ను తెలియజేశారు.



First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...