హోమ్ /వార్తలు /సినిమా /

జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన రామ్ గోపాల్ వర్మ..

జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ, వై.యస్.జగన్మోహన్ రెడ్డి

రామ్ గోపాల్ వర్మ, వై.యస్.జగన్మోహన్ రెడ్డి

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినందుకు ఆ పార్టీ అధినేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ సంబరపడిపోతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా రామ్ గోపాల్ వర్మ..జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాడు.

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినందుకు ఆ పార్టీ అధినేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ సంబరపడిపోతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు వైయస్ఆర్‌సీపీ గెలిచినప్పటి నుంచి తనదైన శైలిలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను తనదైన శైలిలో సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ..జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాడు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నట్టు ఇది వరకే ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకు పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వచ్చిన వర్మ ఫస్ట్ టైమ్ ..జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో చంద్రబాబు సహా టీడీపీని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇపుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా మారాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి పట్టాభిషేక్ మహోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆయన్ని చూసి వైసీపీ శ్రేణుల సంతోషానికి అవధులు లేవు.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Ap election result 2019, Ram Gopal Varma, RGV, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు