పవన్ కళ్యాణ్‌ను తనదైన శైలిలో మళ్లీ కెలికిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి మాత్రం..

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినందుకు ఆ పార్టీ అధినేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ సంబరపడిపోతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మరికొన్ని గంటల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ..పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో పెద్ద లేఖను పోస్ట్ చేసాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: May 29, 2019, 4:45 PM IST
పవన్ కళ్యాణ్‌ను తనదైన శైలిలో మళ్లీ కెలికిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి మాత్రం..
రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్
 • Share this:
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినందుకు ఆ పార్టీ అధినేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ సంబరపడిపోతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు వైయస్ఆర్‌సీపీ గెలిచినప్పటి నుంచి తనదైన శైలిలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేసాడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో చంద్రబాబును కావాల్సినంత టార్గెట్ చేసి అనుకున్నది సాధించాడు రామ్ గోపాల్ వర్మ. ఈయన తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రభావమో.. చంద్రబాబుపై వ్యతిరేకతనో కానీ..ఈ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరికొన్ని గంటల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ..పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో పెద్ద లేఖను పోస్ట్ చేసాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
  • జగన్ నువ్వెలా CM అవుతావో చూస్తా..

  • జగన్ నీకు మగతనం ఉందా ?

  • జగన్ నువ్వు అసలు రెడ్డివేనా ?
  • జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడు.

  • జగన్ చిన్న కోడి కత్తికే గింజుకున్నాడు.

  • తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారన్నారు.

  • రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా

  • బెజవాడ గుండాల తోలు తీస్తా

  • నేను ముఖ్యమంత్రి అవ్వానుకుంటే ఆపేదెవడు ?

  • పాకిస్థాన్‌తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు

  • థియేటర్స్‌లో జాతీయగీతం పాడితేనే దేశభక్తి ఉన్నట్టా ?

  • హిందువులపై ముస్లిమ్స్ దాడులు సహించను

  • ముస్లిమ్స్ దేశభక్తి నిరూపించుకోవాలా ?

  • ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

  • జగన్ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా

  • 2 లక్షల పుస్తకాలు చదివా

  • 32 మార్కులతో 10th పాసయ్య

  • మా అన్నయ్య కూతురు ఇంట్లో నుండి వెళ్లిపోతే సాక్షిలో నీచంగా రాశారు.అంటూ ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్...జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మీరు గెస్ చేయండి.. నేను చెప్పిన ఈ విషయాలు ఎవరిగురించో అంటూ కొంచెం వ్యంగ్యంగా ఈ లేఖ రాసాడు. ఇక చిరంజీవి కూతురు పెళ్లి 2007లో జరిగింది. అప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రికను ప్రారంభించలేదు. అసలు ప్రారంభానికి నోచుకొని పత్రికలో తన అన్నయ్య చిరంజీవి చిన్నకూతురు శ్రిజ వివాహంపై నీచంగా వార్తలు రాసాడని చెప్పడాన్ని ఎత్తి చూపుతూ.. పవన్..ఎన్నికల్లో ఏ రేంజ్‌లో వై.యస్. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నాడు. మొత్తానికి ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలుపు రామ్ గోపాల్ వర్మకు కొండంత బలం ఇచ్చిందనే చెప్పాలి.  ముందు ముందు ఆయన ఎవరినీ ఎలా టార్గెట్ చేస్తాడన్నది చూడాలి. 
First published: May 29, 2019, 4:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading