నాన్న బుజ్జి అంటే ఎవడూ వినడు.. తాట తీయాల్సిందే అంటున్న వర్మ..

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన పోస్టులు పెడుతూ.. అందర్నీ కెలుకుతూ ఉంటాడని చెడ్డపేరు ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 4:34 PM IST
నాన్న బుజ్జి అంటే ఎవడూ వినడు.. తాట తీయాల్సిందే అంటున్న వర్మ..
రామ్ గోపాల్ వర్మ (Twitter/Photo)
  • Share this:
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన పోస్టులు పెడుతూ.. అందర్నీ కెలుకుతూ ఉంటాడని చెడ్డపేరు ఉంది. మీరెందుకు ఇలాంటి సినిమాలు తీస్తారు.. సమాజంపై మీకు బాధ్యత లేదా అంటూ లేదు అనే జవాబు చెప్పిన దర్శకుడు ఈయన. కానీ అలా అన్నా కూడా అవసరం ఉన్న సమయంలో ఈయన కూడా తన సామాజిక బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. దేశ పౌరుడిగా ప్రభుత్వం చెప్పింది పాటిస్తూనే.. తన ద్వారా మరికొందర్ని కూడా కరోనాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేసే వర్మ కొన్ని రోజులుగా కరోనాపై యుద్ధం చేస్తున్నాడు.

బాధ్యతాయుతమైన పోస్టులు పెడుతూ కరోనా విషయంలో ప్రజల్లో అవగాహణ పెంచేలా మాట్లాడుతున్నాడు.. అలాగే ట్వీట్స్ కూడా చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం మన కోసం ఇంత చేస్తున్నా కూడా కొందరు మాత్రం ఇంకా ఆకతాయితనంగా రోడ్లపైకి వచ్చేస్తున్నారని.. బాధ్యతారాహిత్యంగా అలా చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నాడు ఈయన. ఈ జనానికి ఇలా చెబితే అర్థం కాదు.. ఆర్మీని దించితే కానీ బుద్ధి రాదు అంటూ ఫైర్ అయ్యాడు వర్మ. జనతా కర్ఫ్యూ సమయంలో కనిపించిన నిబద్దత ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటూ ప్రశ్నిస్తున్నాడు ఈయన.


మనకు మనమే బాధ్యత తీసుకుంటే కదా కరోనా కంట్రోల్ అవుతుంది.. నిన్ను నువ్వు సీరియస్‌గా తీసుకోకపోతే ఎలా అంటున్నాడు. మూర్ఖంగా భయటకు వచ్చే వారిని అదుపు చేయాలంటే ఆర్మీని రంగంలోకి దించాల్సిందే అంటూ ప్రభుత్వానికి వర్మ సలహా కూడా ఇచ్చాడు. 15 రోజులు ఇంట్లో ఉంటారా లేదంటే 5 ఏళ్లు జైల్లో ఉంటారా అంటూ రష్యా ప్రధాని ఆ దేశ ప్రజలను హెచ్చరించాడు.
అలాగే మన రాజకీయ నాయకులు కూడా బుద్దిగా ఇంట్లో ఉండకుంటే ఆర్మీ చేతిలో చావు దెబ్బలు తినక తప్పదు అంటూ హెచ్చరించాలంటూ ప్రభుత్వాలకు సూచించాడు ఈ దర్శకుడు. ప్రజలు తమకు తాముగా ఇంట్లో కానీ ఉండకపోతే జరిగే నష్టం ఊహకు కూడా అందదంటున్నాడు ఈయన. జనాలు ఇప్పటికైనా కరోనా మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకుని ఇంట్లోనే ఉండిపోవాలని విజ్ఞప్తి చేసాడు వర్మ. తగ్గిపోయే వరకైనా ఇంటికే పరిమితం అవుతారేమో చూడాలి. లేదంటే ఆర్మీని రంగంలోకి దించే వరకు చూస్తారా..?

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు