జగన్‌‌ను బూతులు తిట్టిన రామ్ గోపాల్ వర్మ..

అవును రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా జగన్ పై బూతులతో విరుచుకుపడ్డాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 20, 2019, 7:30 PM IST
జగన్‌‌ను బూతులు తిట్టిన రామ్ గోపాల్ వర్మ..
రాంగోపాల్ వర్మ (File)
  • Share this:
అవును రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా జగన్ పై బూతులతో విరుచుకుపడ్డాడు. జగన్ అంటే ఏపీ సీఎం జగన్ కాదు.. వర్మ తన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాథ్‌ను ముద్దుగా జగన్‌ అని పిలుస్తుంటాడు. తాజాగా పూరీ జగన్నాథ్.. తన దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో చాల ా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ.. ఈ శనివారం శ్రీరాములు థియేటర్‌లో షాంపైన్ పొంగించి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు అక్కడ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మిని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవడం పెద్ద సంచలనం అయింది. అంతకు ముందు వర్మ.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూడటానికి తన ఇద్దరు శిష్యులు అజయ్ భూపతి, అగస్త్య మంజులతో కలిసి హెల్మెట్ ధరించకుండా త్రిపుల్ రైడింగ్‌తో రావడంపై పెద్ద దుమారామే రేగింది. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఎక్కిన బండికి రూ.1335 ఫైన్ చేసారు. అంతేకాదు ఈ చాలాన్‌ను రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌కు ట్యాగ్ చేసారు.

ఇక సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ..తన ట్విట్టర్‌లో ఇలాంటి బ్లాక్ బస్టర్లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తీయడం లేదురా.... అంటూ కాస్త బూతును దట్టించి మరి ట్వీట్ చేసాడు.మరోవైపు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్‌కు నెటిజన్స్‌ తెగ ట్రోల్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌కు అనే ముందు ..నువ్వే హిట్టు తీసి చూపించు అంటూ కొంత నెటిజన్స్‌ను రామ్ గోపాల్ వర్మను ట్విట్టర్ సాక్షిగా ఓ ఆట ఆడుకుంటున్నారు.అంతేకాదు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూసిన తర్వాత శ్రీరాములు థియేటర్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను మరోసారి చూస్తున్నట్టు ప్రకటించాడు.


ఈ విధంగా ‘ఇస్మార్ట్ శంకర్’కు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో బాగానే ప్రచారం చేస్తూ తను వార్తల్లో నిలిచాడు.
First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు