HOME »NEWS »MOVIE »sensational director rajamouli revealed his retirement plans in recent interview pk

రాజమౌళి రిటైర్మెంట్ తర్వాత అక్కడే సెటిల్ అయిపోతాడంట..

రాజమౌళి రిటైర్మెంట్ తర్వాత అక్కడే సెటిల్ అయిపోతాడంట..
రాజమౌళి సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి అంటూ వర్మ రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Rajamouli: రాజమౌళిని ఇప్పుడు కేవలం తెలుగు దర్శకుడు మాత్రమే అనడం తప్పే అవుతుంది. ఆయన పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కోసం..

  • Share this:
రాజమౌళిని ఇప్పుడు కేవలం తెలుగు దర్శకుడు మాత్రమే అనడం తప్పే అవుతుంది. ఆయన పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులంతా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కూడా 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 8, 2021లో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఐదు భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే అప్పుడే ఈయన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పేస్తున్నాడు.

దర్శకుడు రాజమౌళి (Rajamouli)
దర్శకుడు రాజమౌళి (Rajamouli)




19 ఏళ్ల కింద ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1 సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. ఆ తర్వాత చేసిన ప్రతీ సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిపోయాడు. సింహాద్రి, మగధీర, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు జక్కన్న. ఒక్కో సినిమాకు ఈయన చాలా సమయం తీసుకుంటాడు. ఈ లెక్కన కెరీర్ మొత్తంలో మహా అయితే మరో పది సినిమాలు కానీ తీస్తాడేమో అంతే.. దాంతో తన రిటైర్మెంట్ గురించి కూడా చెప్పుకొచ్చాడు దర్శక ధీరుడు.

దర్శకుడు రాజమౌళి (rajamouli)
దర్శకుడు రాజమౌళి (rajamouli)


ముఖ్యంగా మరో పదేళ్ల వరకు రిటైర్మెంట్ తీసుకోనని ప్రకటించాడు రాజమౌళి. తన కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లాలోని ఈదులూరు గ్రామంలో ఉంటారని చెప్పాడు రాజమౌళి.. రిటైర్మెంట్ తర్వాత పిల్లలంతా స్థిరపడ్డాక అక్కడికి వెళ్లి వుండాలని ముందే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు దర్శక ధీరుడు. అక్కడే ఫామ్ హౌజ్ నిర్మించుకుని శేష జీవితాన్ని గడపాలని ఫిక్సైపోయినట్లు చెప్పాడు రాజమౌళి.
Published by:Praveen Kumar Vadla
First published:April 24, 2020, 22:56 IST

टॉप स्टोरीज