తెలుగు ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ అంటే ముందుగా గుర్తొచ్చే హీరో బాలకృష్ణ. ఆయనేం చేసినా కూడా అభిమానులు సాహో అంటారు. తొడగొట్టి కుర్చీని పిలిచినా ఆయనే.. మీసం తిప్పి ట్రైన్ వెనక్కి పంపినా ఆయనే.. అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో బాలయ్య. అప్పుడప్పుడూ సరైన కథలు పడక డిజాస్టర్స్ ఇస్తుంటాడు కానీ ఒక్కసారి బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే కథ కానీ పడిందంటే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అలాంటి క్రేజ్ ఉన్న హీరోతో రాజమౌళి లాంటి మాస్ దర్శకుడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఆ ఊహే అద్భుతం కదా.

బాలయ్య రాజమౌళి (balakrishna rajamouli movie)
ఎందుకంటే రాజమౌళి, బాలయ్య లాంటి కాంబినేషన్ కలిస్తే వచ్చే ఔట్ పుట్కు బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. నిజానికి ఈ ఇద్దరూ కలిసి 17 ఏళ్ల కిందే సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా మిస్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన సింహాద్రి సినిమా కోసం ముందు బాలయ్యనే అనుకున్నాడు రాజమౌళి. అయితే ఆ సమయంలో అలాంటి ఫ్యాక్షన్ కథలు చాలానే చేయడంతో సింహాద్రి వైపు ఆసక్తి చూపించలేదు బాలయ్య. అలా ఎన్టీఆర్‌కు ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కూడా బాలయ్యతో సినిమా కోసం కొన్నిసార్లు ప్రయత్నించిన ముచ్చట ఇప్పుడు చెప్పుకొచ్చాడు రాజమౌళి.

బాలయ్య రాజమౌళి (balakrishna rajamouli movie)
తాజాగా లాక్డౌన్ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో బాలయ్య సినిమా గురించి కూడా ఓపెన్ అయ్యాడు రాజమౌళి. నిజానికి చాలా సంవత్సరాల నుంచి చిరంజీవి, బాలయ్యతో సినిమాలు చేయాలని చూస్తున్నా కూడా కుదర్లేదని చెప్పాడు. బాలయ్యతో సినిమా చేయడం తన కోరిక అంటున్నాడు దర్శక ధీరుడు. ఈయన కోరిక ఇప్పట్లో తీరుతుందా అంటే మాత్రం అది కాస్త కష్టమే కానీ ఒక్కసారి అన్నీ కుదిరి బాలయ్య, రాజమౌళి కలిస్తే మాత్రం ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. అది జరగాలని నందమూరి అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:April 25, 2020, 18:08 IST