బాహుబలి సినిమాపై రాజమౌళి ఎమోషనల్ ట్వీట్..

ఒక్కో చినుకు తుపానుగా మారినట్టు.. తెలుగు సినిమాగా మొదలైన ‘బాహుబలి’ ఆ తర్వాత జాతీయ స్థాయి సినిమాగా ఆపై అంతర్జాతీయంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసింది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి ట్వీట్ చేసాడు.

news18-telugu
Updated: October 6, 2019, 9:31 PM IST
బాహుబలి సినిమాపై రాజమౌళి ఎమోషనల్ ట్వీట్..
బాహుబలి సినిమాపై రాజమౌళి ఎమోషనల్ ట్వీట్ (Twitter/Photo)
news18-telugu
Updated: October 6, 2019, 9:31 PM IST
ఒక్కో చినుకు తుపానుగా మారినట్టు.. తెలుగు సినిమాగా మొదలైన ‘బాహుబలి’ ఆ తర్వాత జాతీయ స్థాయి సినిమాగా ఆపై అంతర్జాతీయంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసింది. తాజాగా ఈ సినిమాపై రాజమౌళి ట్వీట్ చేసాడు. వివరాల్లోకి వెళితే.. 2015లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక సంచలనం సృష్టించింది. అంతేకాదు తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానాలు ఆల్ ఇండియా స్టార్స్‌ అయిపోయారు. ఐతే.. ఈసినిమాను లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాన్ ఇంగ్లీష్ సినిమాగా బాహుబలి ..ది బిగినింగ్’ రికార్డులకు ఎక్కింది. ఈ విషయమై చాలా సంతోషంగా ఉందంటూ రాజమౌళి కాస్తంత ఎమెషనల్ ట్వీట్ చేసాడు.


ఈ నెల 19న అక్కడ ‘బాహుబలి.. ది బిగినింగ్’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు బాహుబలి టీమ్ మొత్తం హాజరు కానుంది. ‘బాహుబలి’ తో పాటు అక్కడ ‘స్కైఫాల్’,‘హ్యరీ పోటర్’ వంటి చిత్రాలను ప్రదర్శించనున్నారు. అంతేకాదు  అక్కడ కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్ కాన్సెర్ట్ కూడా జరగనుంది.

First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...