చిరంజీవిని వదిలే సమస్యే లేదంటున్న ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..
పూరీ జగన్నాథ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌తోనే ప్రస్తుతం బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. ఇందులో భాగంగానే చిరంజీవి సినిమాపై మనసులో మాట బయటపెట్టాడు ఈయన.

పూరీ జగన్నాథ్, మెగాస్టార్ చిరంజీవి
- News18 Telugu
- Last Updated: July 23, 2019, 6:42 PM IST
పూరీ జగన్నాథ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టి మంచి జోరు మీదున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌తోనే ప్రస్తుతం బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. ఇందులో భాగంగానే మరోసారి చిరంజీవి సినిమాపై మనసులో మాట బయటపెట్టాడు ఈయన. ఒకప్పుడు చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందుకుని.. చేజార్చుకున్నాడు ఈ దర్శకుడు. ఒకటి రెండు కాదు.. నాలుగుసార్లు తనకు చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి ఆగిపోయిందని గుర్తు చేసుకున్నాడు ఈ దర్శకుడు....

రెండుసార్లు పూజా కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత చిరంజీవి సినిమా ఆగిపోయిందని చెప్పాడు పూరీ. నిజానికి చిరు 150వ సినిమా పూరీ జగన్నాథే చేయాలి. ఆటో జానీ అంటూ కథ రాసుకుని అప్పట్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు నిర్మాత రామ్ చరణ్. కానీ సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కనబెట్టి కత్తి రీమేక్ చేసాడు చిరంజీవి. ఆ తర్వాత పూరీ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు.. చిరంజీవితో సినిమా కోసం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఈ సారి మాత్రం అన్నయ్యను వదిలే సమస్యే లేదంటున్నాడు. పక్కాగా ఆయనకు నచ్చే కథ సిద్ధం చేస్తానని చెబుతున్నాడు. చిరంజీవి సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగలా ఉండాలని.. అలాంటి కథతోనే తనను మెప్పిస్తానని ధీమాగా చెబుతున్నాడు ఈ దర్శకుడు. త్వరలోనే చిరంజీవిని కలిసి ఆయనకు నచ్చే కథ చెప్పి కాంబినేషన్ వర్కవుట్ చేస్తానంటున్నాడు. ఈ సారి కానీ చిరు చెబితే కేవలం ఐదు రోజుల్లోనే ఆయన కోసం కథ సిద్ధం చేస్తానంటున్నాడు. మరిప్పుడు పూరీ ఫామ్‌లోకి వచ్చేసాడు.. చిరంజీవి ఈ సారైనా ఈ దర్శకున్ని నమ్ముతాడో లేదో చూడాలిక.

చిరంజీవి ఆటోజానీ

పూరీ జగన్నాథ్ రామ్ చరణ్
రామ్ చరణ్, చిరంజీవి తీరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాతల అసహనం..
మహేష్ బాబు AMB థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి..
నిరుద్యోగులకు ఉపాసన కొణిదెల మరో బంపరాఫర్.. ఈ సారి మాత్రం..
పవన్ కళ్యాన్‌తో సినిమా చేయనన్న ఆ నటుడు..
అమెజాన్ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..
అందుకే ఇకపై వాటికి జోలికి పోవడం లేదన్న నాగబాబు..

Loading...