లాక్‌డౌన్ పాటించాలంటే ఇలా చేయండి.. పూరీ జగన్నాథ్ సలహా..

Puri Jagannadh: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తుంది. ప్రతీ దేశంలోనూ చావులు కంటిన్యూ అవుతున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక.. జనాన్ని కంట్రోల్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 2:32 PM IST
లాక్‌డౌన్ పాటించాలంటే ఇలా చేయండి.. పూరీ జగన్నాథ్ సలహా..
పూరీ జగన్నాథ్ (Source: Twitter)
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తుంది. ప్రతీ దేశంలోనూ చావులు కంటిన్యూ అవుతున్నాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక.. జనాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. మిగిలిన దేశాల ప్రజలేమో కానీ మన దేశంలో మాత్రం ఫ్రీడమ్ ఎక్కువ కదా.. అందుకే బయటి తిరిగిన ప్రాణాలకు ఇంట్లో కూర్చోండిరా అంటూ ఊరికే ఉండటం లేదు. అందుకే ఏదో ఓ కారణం చెప్పి బయటికి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మరోవైపు రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దాంతో ప్రభుత్వానికి కూడా ఇప్పుడేం చేయాలో అర్థం కాని పరిస్థితి.

పూరీ జగన్నాథ్ ఫైల్ ఫోటో (Vijay Devarakonda Puri jagannadh)
పూరీ జగన్నాథ్ ఫైల్ ఫోటో (Vijay Devarakonda Puri jagannadh)


కొట్టాలా.. తిట్టాలా.. ఎలా చెప్తే మారుతారు మీరు అంటూ తల పట్టుకుంటున్నారు ముఖ్యమంత్రులు కూడా. కరోనాని కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ తప్ప మరో ఆప్షన్ లేదని కేసీఆర్ సహా ప్రధాని మోదీ.. వైద్యులు, సినిమా ప్రముఖులు అంతా చెప్తున్నారు. అయినా కూడా కరోనా మమ్మల్నేం చేయదన్నట్లు బయటికి వచ్చేస్తున్నారు జనాలు. రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతున్నారు. అడిగితే విచిత్రమైన కారణాలు చెబుతున్నారు. ఇందులో నిజమైన కారణాలతో బయటికి వచ్చేవాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.


ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ వినూత్న సలహా ఇచ్చాడు. ప్రజలని లాక్‌డౌన్ చేయాలంటే.. ఓ దారి ఉందని చెప్పాడు ఈయన. అదే డ్రోన్.‌. గౌరవంతో చేయలేని పనులు భయంతోనే చేయించాలంటున్నాడు ఈయన. లాక్‌డౌన్‌కు ఆర్మీ, పోలీస్ ఆఫీసర్స్ అక్కర్లేదు.. తక్కువ ఖర్చుతో డ్రోన్‌కు దెయ్యాన్ని కట్టి జనాలపైకి వదిలేయండి అంటున్నాడు ఈ దర్శకుడు. అలా చేస్తే కచ్చితంగా చచ్చినట్లు ఇంట్లోనే ఉంటారంటూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసాడు పూరీ.
Published by: Praveen Kumar Vadla
First published: March 29, 2020, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading