ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పూరీ జగన్నాథ్ సెల్యూట్..

YS Jagan Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ప్రస్తుతం సినిమాలతో పాటు అప్పుడప్పుడూ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటాడు. ఇఫ్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. దేశవ్యాప్తంగా ప్రస్తుతం విశాఖ గ్యాస్ లీకేజ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 7, 2020, 5:12 PM IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పూరీ జగన్నాథ్ సెల్యూట్..
వైఎస్ జగన్, పూరీ జగన్నాథ్ (ys jagan puri jagannadh)
  • Share this:
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం సినిమాలతో పాటు అప్పుడప్పుడూ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటాడు. ఇఫ్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. దేశవ్యాప్తంగా ప్రస్తుతం విశాఖ గ్యాస్ లీకేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంత అంతులేని విషాదాన్ని నింపింది ఈ ఘటన. దీనిపై ప్రధాని మోదీ సహా చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్ఘ్రాంతిని వ్యక్తం చేసారు. పూరీ జగన్నాథ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ఇది జీర్ణించుకోలేని చేదు నిజమని.. ఎంతోమంది ఈ గ్యాస్ లీకేజీతో ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్ చేసాడు పూరీ జగన్నాథ్. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా సరైన సమయంలో స్పందించి సాయం చేయడం అనేది గొప్ప విషయమని తెలిపాడు పూరీ.

అంతేకాదు.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి తక్షిణ సాయం అందించి.. వాళ్లకు నేనున్నాను అనే భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సెల్యూట్ అంటూ ట్వీట్ చేసాడు పూరీ జగన్నాథ్. కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోడానికి ఎప్పుడూ ముందుండే మీ మనసుకు సెల్యూట్ అని ట్వీట్ చేసాడు పూరీ. వైజాగ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ ముగించాడు ఈ దర్శకుడు. ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ముందు నుంచి కూడా వైఎస్ కుటుంబంతో పూరీకి మంచి సంబంధమే ఉంది. అప్పట్లో వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయనపై బయోపిక్ కూడా అనౌన్స్ చేసి ఆపేసాడు పూరీ.
Published by: Praveen Kumar Vadla
First published: May 7, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading