Koratala Siva: దర్శకుడు కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..

Koratala Siva: తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ. ఈయన దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ పని చేస్తున్నారు. తనకింద పని చేసే వాళ్లను సొంత మనుషుల్లా చూసుకుంటాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2020, 7:10 PM IST
Koratala Siva: దర్శకుడు కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..
కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం (koratala siva assistant)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ. ఈయన దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ పని చేస్తున్నారు. తనకింద పని చేసే వాళ్లను సొంత మనుషుల్లా చూసుకుంటాడు ఈ దర్శకుడు. అయితే ఇప్పుడు అనుకోని సంఘటన ఒకటి ఈ దర్శకుడిని బాగా డిస్టర్బ్ చేసిందని తెలుస్తుంది. కొరటాల శివ దగ్గర కొన్ని రోజులుగా అసిస్టెంట్ రైటర్‌గా పని చేస్తున్న మహేష్ తాజాగా పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది.
కొరటాల శివ (koratala siva)
కొరటాల శివ (koratala siva)


దీనివెనక కారణాలు కూడా బలంగానే ఉన్నాయి. అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామ వాసి అయిన మహేష్‌ కొన్నాళ్లుగా దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే బిజీగా ఉన్నాడు. అయితే సెప్టెంబర్ 8న పోలీసులు మహేష్ అన్నయ్యను అరెస్ట్ చేసారు. తన అన్న కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి అక్రమంగా అమ్ముతున్నాడని పోలీసులు ఇంటికి వచ్చి విచక్షణారహితంగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు మహేష్. అక్కడే వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.
కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం (koratala siva assistant)
కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం (koratala siva assistant)

అసలేం జరిగిందని ఆరా తీస్తే.. అక్రమంగా మద్యం అమ్ముతున్నారంటూ నాలుగు రోజుల కింద తమ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని.. అయితే ఇంట్లో మద్యం బాటిళ్లు దొరకలేదని చెప్పుకొచ్చాడు మహేష్. కానీ తమ ఇంటి పక్కన ఉన్న గల్లీలో 12 మద్యం సీసాలు దొరికాయని.. దాంతో వెంటనే తన అన్నయ్యను అరెస్ట్ చేసారని చెప్పాడు. వాటితో తమకు సంబంధం లేదని.. తమ ఇంట్లో దొరకలేదు కదా అని ప్రశ్నించానని.. అందుకు పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని చెప్పుకొచ్చాడు మహేష్.
కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం (koratala siva assistant)
కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం (koratala siva assistant)

అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమ మద్యం కేసు నమోదు చేశారని చెప్పాడు. దీంతో పెళ్లి పీటల వరకు వచ్చిన తన పెళ్లి కూడా ఆగిపోయిందని చెప్పాడు ఈయన. తన జీవితాన్ని పోలీసులు నాశనం చేశారని వాపోయాడు. అందుకే పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పాడు ఈయన. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం కొరటాల శివ వరకు కూడా వెళ్లిందని ప్రచారం అయితే జరుగుతుంది. అసలు విషయం తెలిసిన తర్వాత కొరటాల కూడా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 22, 2020, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading