అనిల్ రావిపూడి షాకింగ్ నిర్ణయం.. అంతా లాక్‌డౌన్ మహిమ..

అనిల్ రావిపూడి (anil ravipudi)

Anil Ravipudi: కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో 100 రోజులుగా థియేటర్స్ మూతపడ్డాయి. ఒకప్పుడు 100 రోజుల సినిమాలు ఉండేవి. కానీ ఇప్పుడు విజయవంతంగా 100 రోజుల పాటు థియేటర్స్ అన్నీ మూసేసారు.

  • Share this:
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో 100 రోజులుగా థియేటర్స్ మూతపడ్డాయి. ఒకప్పుడు 100 రోజుల సినిమాలు ఉండేవి. కానీ ఇప్పుడు విజయవంతంగా 100 రోజుల పాటు థియేటర్స్ అన్నీ మూసేసారు. అసలు కలలో కూడా ఇలాంటి ఓ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది కరోనా వైరస్. ఎప్పుడూ షూటింగ్స్ చేసుకుంటూ బిజీగా ఉండే సినిమా వాళ్లను కూడా అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చోబెట్టేసింది కరోనా. ఈ క్రమంలోనే ఒక్కొక్కరూ ఒక్కోలా ఈ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సంచలన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఓ నిర్ణయం తీసుకున్నాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)
దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)

లాక్‌డౌన్ కారణంగా ఈయన తీసుకున్న నిర్ణయం చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడు సినిమాలు చేసినా థియేటర్స్ లేవు.. అసలు ఈ ఏడాది థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు.. ఓపెన్ అయినా ఆడియన్స్ వస్తారనే నమ్మకం లేదు. దాంతో ఈయన సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నాడు. అల్లు అరవింద్ ఆహా డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లో ఓ కామెడీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)
దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)

ఇప్పటికే తెలుగులో క్రిష్ లాంటి దర్శకులు వెబ్ సిరీస్‌లు చేసారు. ఇప్పుడు అనిల్ సైతం అదిరిపోయే కామెడీ వెబ్ సిరీస్ ఒకటి సిద్ధం చేసాడని తెలుస్తుంది. ఇది పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నాడు అనిల్. ప్రస్తుతం ఈయన ఎఫ్ 3తో పాటు రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఏడాది మొదట్లో సరిలేరు నీకెవ్వరుతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు అనిల్. ఇది ఆయనకు వరసగా ఐదో విజయం. ఇప్పటికే ఈయన ఖాతాలో పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలున్నాయి.
First published: