శ్రీ రెడ్డి కొత్త బిజినెస్.. పలుకుబడే భారీ పెట్టుబడి..

శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్ (sri reddy)

Sri Reddy: శ్రీ రెడ్డి.. పరిచయం అవసరం లేని పేరు. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుంది తెలియని ఓ ఆడ బాంబు. అయితే ఈ మధ్య అది పేలడం లేదు.. హాయిగా తన పని తాను చేసుకుంటుంది. అవును.. అత్తారింటికి దారేది సినిమాలో..

  • Share this:
శ్రీ రెడ్డి.. పరిచయం అవసరం లేని పేరు. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుంది తెలియని ఓ ఆడ బాంబు. అయితే ఈ మధ్య అది పేలడం లేదు.. హాయిగా తన పని తాను చేసుకుంటుంది. అవును.. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు శ్రీ రెడ్డి చాలా కూల్ అయిపోయింది. ఎవరి జోలికి వెళ్లడం లేదు. తన పనేదో తాను చూసుకుంటుంది.. చేసుకుంటుంది. ముఖ్యంగా కొన్ని రోజుల కింద కొత్త బిజినెస్ మొదలుపెట్టింది శ్రీ రెడ్డి. అందులో భారీగానే సంపాదించుకుంటుంది కూడా. తనకున్న పాపులారిటీనే అందులో పెట్టుబడిగా పెట్టేసింది శ్రీ రెడ్డి.
శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్ (sri reddy)
శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్ (sri reddy)

దాంతో లాభాలు కూడా భారీగానే వస్తున్నాయిప్పుడు. శ్రీ రెడ్డి ప్రస్తుతం యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుని సింపుల్‌గా అందులో వంటలు చేసుకుంటుంది. మరో మాట లేకుండా చికెన్, మటన్ వండుకుంటూ తాను తింటూ.. పది మందికి తినిపిస్తుంది. ఈ వీడియోలు తన స్టైల్లో తీసి యూ ట్యూబ్‌‌లో పోస్ట్ చేస్తుంది శ్రీ రెడ్డి. అవి కాస్తా బాగానే వైరల్ అవుతున్నాయిప్పుడు. ఒక్కో వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. వస్తాయి.. ఎందుకంటే అక్కడున్నది శ్రీ రెడ్డి మరి. ఆ మాత్రం రాకపోతే ఎలా..? అందుకే తన పాపులారిటీని సరిగ్గా వాడుకుంటూ లేట్ చేయకుండా వరసగా వంట వీడియోలు పోస్ట్ చేస్తుంది శ్రీ రెడ్డి.
శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్ (sri reddy)
శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్ (sri reddy)

మొన్న చేపల పులుసు.. నిన్న సంక్రాంతి కోడికూర.. ఈ రోజు మటన్.. ఇలా రోజుకో వెరైటీ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా చూసిన తర్వాత ఇలా హాయిగా నీ పని నువ్వు చేసుకోక ఎందుకమ్మా నీకు అలాంటి పిచ్చి పనులన్నీ అంటూ నెటిజన్లు కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా శ్రీ రెడ్డి ఇలా సైలెంట్ అయిపోవడం మాత్రం కొందరికి నిజంగానే షాక్. మరి ఈ సైలెన్స్ వెనక వయలెన్స్ ఏమైనా ఉందా.. లేదంటే నిజంగా వచ్చిన మార్పా అనేది త్వరలోనే తేలనుంది.
Published by:Praveen Kumar Vadla
First published: