తమిళ హీరో విశాల్ ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. ఈ సారి మాత్రం..

శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలా మందిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తెలుగు హీరోలతో పాటు  తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. తాజాగా శ్రీరెడ్డి..నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌ను టార్గెట్ చేసింది.

news18-telugu
Updated: June 18, 2019, 12:09 PM IST
తమిళ హీరో విశాల్ ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. ఈ సారి మాత్రం..
శ్రీరెడ్డి, విశాల్
  • Share this:
శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న చాలా మందిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తెలుగు హీరోలతో పాటు  తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది.తెలుగు సినీ పరిశ్రమలో తెర వెనుక జరుగుతున్న లైంగిక బాగోతంపై గళం విప్పి ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించింది శ్రీరెడ్డి. ఈమె మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, రాఘవ లారెన్స్ పై   లైంగిక ఆరోపణలు చేసింది. ప్రస్తుతం చెన్నై లో మకాం పెట్టిన శ్రీరెడ్డి.. తాజాగా ప్రముఖ తమిళ హీరో విశాల్ ను టార్గెట్ చేసింది. వివరాల్లోకి వెళితే..త్వరలో జరగనున్న నడిగర్ సంఘం ఎన్నికల నేపథ్యంలో ఏ కారణం లేకుండానే విశాల్ ను టార్గెట్ చేస్తూ... తన సోషల్ మీడియా ద్వారా విమర్శలకు దిగుతోంది.

Sensational Actress Sri Reddy Comments on Tamil Star Hero Vishal.. Here are the Details..,vishal,sri reddy,sri reddy vishal,sri reddy comments on tamil hero vishal,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,vishal twitter,vishal instagram,vishal age,vishal marriage,vishal facebook,tollywood,kollywood,tamil cinema,vishal nadigar sangam,nadigar sangam,విశాల్,విశాల్ శ్రీరెడ్డి,శ్రీరెడ్డి,విశాల్ పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్,విశాల్ పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు,విశాల్ నడిగర్ సంఘం,కోలీవుడ్ న్యూస్,తమిళ్ సినిమా,
విశాల్,శ్రీరెడ్డి


ఇప్పటికే ఈ  ఎన్నికల్లో విశాల్, శరత్ కుమార్ బృందాలు పోటీపడుతుండడం. ప్రస్తుతం ఈ రెండు ప్యానెల్ ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తుండడంతో తమిళ చిత్ర వాతావరణం చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి.. విశాల్ ను టార్గెట్ చేయడంలో మర్మమేమిటని పెద్ద చర్చే నడుస్తోంది. గతంలో విశాల్..శ్రీరెడ్డి ఇష్యూను సాల్వ్ చేస్తానని చెప్పాడు. అలాంటి విశాల్‌ను శ్రీరెడ్డి టార్గెట్ చేయడం ఏంటిని కొంత మంది శ్రీరెడ్డి తీరును విమర్శిస్తున్నారు. డబ్బులు ఆశించే  శ్రీరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విశాల్ వర్గం శ్రీరెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నట్టు కనిపించినా శ్రీరెడ్డి మళ్లీ  మొదలెట్టేసింది అంటూ విమర్శిస్తున్నారు కొందరు తమిళ తంబీలు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు