సంచలన దర్శకుడిపై మోజుపడిన శ్రీ రెడ్డి.. నువ్వే కావాలంటూ పోస్ట్..

శ్రీ రెడ్డి (Facebook photo)

శ్రీ రెడ్డి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ సీరియస్‌గా ఎవరో ఒకర్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే శ్రీ రెడ్డి.. ఈ సారి మాత్రం ఆమెలోని..

  • Share this:
శ్రీ రెడ్డి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ సీరియస్‌గా ఎవరో ఒకర్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే శ్రీ రెడ్డి.. ఈ సారి మాత్రం ఆమెలోని రొమాంటిక్ కోణం బయటికి వచ్చింది. ఉన్నట్లుండి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మనసు పారేసుకుంది శ్రీ రెడ్డి. ఏమైందో తెలియదు కానీ అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలోనే రాముకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తనలో ఎప్పుడూ సీరియస్ కోణమే కాదు.. అప్పుడప్పుడూ ఇలా రొమాంటిక్ అమ్మాయి కూడా బయటికి వస్తుందని చెబుతుంది శ్రీ రెడ్డి. ఏకంగా తన ఫేస్‌బుక్ పేజీలో రామ్ గోపాల్ వర్మతో డేటింగ్ చేయాలని ఉందని చెప్పేసింది శ్రీ రెడ్డి.

ఇది చూసి నెటిజన్లు కూడా పరేషాన్ అవుతున్నారు. అయితే శ్రీ రెడ్డి పోస్ట్ చూసిన తర్వాత కొందరు మాత్రం ఇద్దరిదీ భలే కాంబినేషన్.. ఆయన ఎవర్ని పట్టించుకోడు.. ఈమె ఎవర్నీ వదిలిపెట్టదు.. ఇద్దరి కాంబినేషన్ అదుర్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఉన్నట్లుండి శ్రీ రెడ్డి మనసు వర్మపైకి వెళ్లిందో అర్థం కావడం లేదు కానీ తను మాత్రం ఆయనతో డేటింగ్‌కు వెళ్లాలని ఉందని చెబుతుంది. మరి శ్రీ రెడ్డి ఇచ్చిన ఆఫర్‌ను వర్మ అంగీకరిస్తాడో లేదో.. అసలే ఆయనిప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా బిజీతో ఉన్నాడు. ఈ చిత్రం కావాల్సినన్ని సంచలనాలు రేపుతుంది. ఇలాంటి సమయంలో శ్రీ రెడ్డి ఆయనకు రొమాంటిక్ ఆఫర్ ఇచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published: