#SaveNallamala: పవన్ కల్యాణ్‌తో స్వరం కలిపిన విజయ్ దేవరకొండ..

తెలంగాణలో ప్రస్తుతం ఒకే సమస్య సంచలనం రేపుతుంది. అదే సేవ్ నల్లమల.. ఆ అడవుల్లో యురేనియం కోసం తవ్వకాలు చేయాలంటూ ఆజ్ఞ రావడంతో ఇప్పుడు అంతా దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 12, 2019, 2:32 PM IST
#SaveNallamala: పవన్ కల్యాణ్‌తో స్వరం కలిపిన విజయ్ దేవరకొండ..
పవన్ కల్యాణ్ విజయ్ దేవరకొండ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 12, 2019, 2:32 PM IST
తెలంగాణలో ప్రస్తుతం ఒకే సమస్య సంచలనం రేపుతుంది. అదే సేవ్ నల్లమల.. ఆ అడవుల్లో యురేనియం కోసం తవ్వకాలు చేయాలంటూ ఆజ్ఞ రావడంతో ఇప్పుడు అంతా దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న ఆదివాసులు కూడా దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఊహించని స్పందన వస్తుంది. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఇదే చేసాడు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తున్నారా.. లేదంటే రోగాలతో కూడిన తెలంగాణను ఇవ్వాలనుకుంటున్నారా అంటూ ఆయన ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు.
Sensational Actor Vijay Devarakonda joined with Pawan Kalyan in Save Nallamala campaign pk తెలంగాణలో ప్రస్తుతం ఒకే సమస్య సంచలనం రేపుతుంది. అదే సేవ్ నల్లమల.. ఆ అడవుల్లో యురేనియం కోసం తవ్వకాలు చేయాలంటూ ఆజ్ఞ రావడంతో ఇప్పుడు అంతా దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. save nallamala,vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda save nallamala,pawan kalyan twitter,janasena twitter,pawan kalyan save nallamala,vijay devarakonda pawan kalyan,sekhar kammula save nallamala,telugu cinema,సేవ్ నల్లమల,పవన్ కల్యాణ్ సేవ్ నల్లమల,విజయ్ దేవరకొండ సేవ్ నల్లమల,జనసేన పవన్ కల్యాణ్,తెలుగు సినిమా
శేఖర్ కమ్ముల (Sourcw: Twitter)

భూమి ప్రజలకు సంబంధించిన ఆస్థి కాదు. భూమి భవిష్యత్ తరాలను కొనసాగించే సంపద అంటూ ట్వీట్ చేసాడు పవన్ కల్యాణ్. భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలు ఆలోచించాలి.. అంటూ ప్రశ్నించాడు. సేవ్ నల్లమల అంటూ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఒత్తిడి తీసుకొస్తున్నాడు జనసేనాని. ఈ విషయంలో ఆంధ్రా తెలంగాణా లోని అన్ని పార్టీలు కలసి రావాలంటూ పిలుపునిచ్చాడు పవన్.


ఇక ఇప్పుడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా వేదికగా నల్లమల అడవిలో కేంద్రం చేపట్టనున్న యురేనియం తవ్వకాలపై స్పందించాడు. ఇప్పుడు ఈయన చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారుతుంది. ఇలాంటి తవ్వకాలు బయో డైవర్సిటీని నాశనం చేస్తాయని.. ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదంటున్నాడు విజయ్. దయచేసి ఈ తవ్వకాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాడు ఈయన. ఇప్పటికే నదులను, వాతావరణాన్ని కలుషితం చేశామని.. అందుకే ఒక చోట అతివృష్టి, మరోచోట అనావృష్టి వస్తున్నాయని తెలిపాడు విజయ్.
Loading...
ఇది తన ఒక్కడి ఆవేదన కాదు ప్రజల ఆవేదన కూడా అంటున్నాడు ఈయన. ముఖ్యంగా నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలన్న ఆలోచన కేంద్రం విరమించుకోవాలని ఆయన పరోక్షంగా సూచించాడు. మొత్తానికి పవన్ కల్యాణ్‌తో పాటు ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా సేవ్ నల్లమల అంటూ రావడంతో ఇష్యూ మరింత సీరియస్ అవుతుంది. మరి చూడాలిక.. దీనికి పరిష్కారం ఎక్కడ దొరకబోతుందో..?

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...