Home /News /movies /

SENIOR TOLLYWOOD LEGENDARY HERO NTR BIRTH ANNIVERSARY SPECIAL THESE ARE THE QUALITIES OF MATINEE IDOL NTR TA

స్మృతిలో NTR: ఆ విషయంలో మహానటుడు ఎన్టీఆర్‌కు సరిలేరు మీకెవ్వరు..

మహానటుడు ఎన్టీఆర్ జయంతి  (Twitter/Photo)

మహానటుడు ఎన్టీఆర్ జయంతి (Twitter/Photo)

వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. అభిమానులు షార్ట్ అండ్ స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నేడు ఆయన జయంతి.

ఇంకా చదవండి ...
వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. అభిమానులు షార్ట్ అండ్ స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నేడు ఆయన జయంతి. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా...రాజకీయ వేత్తగా....ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు ఎన్టీఆర్.

స్మృతిలో: ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడే కాదు..మహానాయకుడు, Legendary Actor NTR Birth Anniversary Special, NTR, NTR Kathanayakudu, NTR Mahanayakudu, Nandamuri Taraka Rama Rao, Legendary Actor NTR Birth Anniversary Special, ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మహానాయకుడు, నందమూరి తారక రామారావు, వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది.
సీనియర్ ఎన్టీఆర్


నాటకాలతో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందారు రామారావు.  అతనిలోని నటుడ్ని గుర్తించిన  ప్రముఖ దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు ‘పల్లెటూరిపిల్ల’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో  ‘మనదేశం’ సినిమా లో అవకాశం రావడంతో దానిలో నటించారు. అలా.. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం ‘మనదేశం’ అయ్యింది. 1949లో వచ్చిన ఆ మూవీలో ఒక పోలీస్ ఇన్స్ స్పెక్టర్ పాత్ర పోషించారు. ఆ తర్వాత  1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే ఏడాది విజయా ప్రొడక్షన్ సంస్థ ఎన్టీఆర్, జానకి హీరోహీరోయిన్లుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘షావుకారు’ నిర్మించారు. ఎన్టీఆర్ తొలి ఇరవై ఏళ్లలోనే 200 సినిమాలు చేసారు. యేడాదికి సగటున 10 చిత్రాలు ఆయనవి విడుదలయ్యేవి.

స్మృతిలో: ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడే కాదు..మహానాయకుడు, Legendary Actor NTR Birth Anniversary Special, NTR, NTR Kathanayakudu, NTR Mahanayakudu, Nandamuri Taraka Rama Rao, Legendary Actor NTR Birth Anniversary Special, ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మహానాయకుడు, నందమూరి తారక రామారావు, వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది.
‘ఎన్టీఆర్’ బయోపిక్ పోస్టర్


విజయా సంస్థ తో కుదిరిన ఒప్పందంతో  ఎన్టీఆర్ ఆ బ్యానర్ కు ఆస్థాన నటుడయ్యారు.  1951లో కె.వి.రెడ్డి డైరెక్షన్ లో విజయా వారు నిర్మించిన ‘పాతాళ భైరవి’ నటుడిగా ఎన్టీఆర్‌కు తిరుగులేని స్టార్ డమ్ తీసుకొచ్చింది. 1956లో విడుదలైన ‘మాయాబజార్’లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికాడు.  వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేసారు. ఈ తరువాత ఎన్టీఆర్ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి మురిపించాడు. అంతర్నాటకాల్లో కలపి మొత్తంగా 30కి పైగా చిత్రాల్లో కనిపించారు.

స్మృతిలో: ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడే కాదు..మహానాయకుడు, Legendary Actor NTR Birth Anniversary Special, NTR, NTR Kathanayakudu, NTR Mahanayakudu, Nandamuri Taraka Rama Rao, Legendary Actor NTR Birth Anniversary Special, ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మహానాయకుడు, నందమూరి తారక రామారావు, వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది.
శ్రీకృష్ణుడిగా రామారావు


రామారావు తొలిసారిగా రాముని గెటప్‌లో 'చరణదాసి' అనే సాంఘిక చిత్రంలో కనిపించాడు. రామారావు శ్రీరాముని గెటప్‌లో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు... తమిళంలో  తీసిన 'సంపూర్ణరామాయణం’లో.  ఆ తర్వాత 1963లో విడుదలైన ‘లవకుశ’ సినిమా.. రాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టింది.

లవకుశలో రాముడిగా రామారావు


1959లో ఎవియమ్ వారు నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోసారు రామారావు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్ఎటి పై నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు. అందులో రావణుడిగా నటించి మెప్పించాడు. ఈ తర్వాత ‘వేంకటేశ్వర స్వామి మహత్యం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో వేంకటేశ్వరుడిగా మెప్పించాడు. ఆయన నటంచిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం విశేషం. తెలుగులో ఇలాంటి రేర్ రికార్డు ఎవరికీ లేదు. అంతేకాదు ఆయన సినిమాలు మళ్లీ రిలీజైతే.. మళ్లీ మొత్తం పెట్టుబడి తిరిగి రాబట్టగలగడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.

‘సీతా రామకళ్యాణం’లో రావణుడిగా రామారావు (Twitter/Photo)


పౌరాణికాలే కాదు జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. 1977లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవిరాముడు’తో ఎన్టీఆర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. అదే ఏడాది విడుదలైన ‘దాన వీర శూరకర్ణ’ ను ఎవరూ మరిచిపోలేరు. అందులో ఆయన పోషించిన  శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితర సాధ్యమనే చెప్పాలి. అంతేకాదు దాదాపు 4 గంటల నిడివి కలిగిన ఈ సినిమాను ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేసి అఖండ విజయం సాధించింది.

స్మృతిలో: ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడే కాదు..మహానాయకుడు, Legendary Actor NTR Birth Anniversary Special, NTR, NTR Kathanayakudu, NTR Mahanayakudu, Nandamuri Taraka Rama Rao, Legendary Actor NTR Birth Anniversary Special, ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మహానాయకుడు, నందమూరి తారక రామారావు, వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది.
దాన వీర శూర కర్ణ


ఆ తర్వాత 1979 లో య‌న్టీఆర్ ‘శ్రీమద్విరాట్ విరాట్ పర్వం’లో 5 పాత్రలు పోషించి  మెప్పించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణ, , దుర్యోధన, కీచక, అర్జున, బృహన్నల పాత్రల్ని అవలీలగా పోషించి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు. అంతకు ముందు ‘జగదేకవీరుని కథ’లో శివ శంకరి పాటలో ఐదు పాత్రల్లో తొలిసారి కనిపించారు. అలాగే యన్టీఆర్ స్టార్‌గా వెలుగు తున్న దశలోనే  తాత, తండ్రి, మనవడు పాత్రల్లో ‘కులగౌరవం’ అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేసారు. పేకేటి శివరాం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యన్టీఆర్ నటించిన అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాల్ని లెక్కలేనన్ని పోషించారు యన్టీఆర్.



‘మన దేశం’ చిత్రం యన్టీఆర్ నటించిన ఆఖరి మాస్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతూ ఉండగానే యన్ఠీఆర్  ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సమ్రాట్ అశోక’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ లాంటి  చారిత్రక ,పౌరాణిక  చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు.

స్మృతిలో: ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడే కాదు..మహానాయకుడు, Legendary Actor NTR Birth Anniversary Special, NTR, NTR Kathanayakudu, NTR Mahanayakudu, Nandamuri Taraka Rama Rao, Legendary Actor NTR Birth Anniversary Special, ఎన్టీఆర్..వెండితెర కథానాయకుడు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మహానాయకుడు, నందమూరి తారక రామారావు, వెండితెరపై అందాల రాముడైనా ... కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది.
మేజర్ చంద్రకాంత్ (యూట్యూబ్ క్రెడిట్)


యన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో  13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెర పై చెరగని ముద్ర వేసారు. అంతేకాదు హిందీలో ‘నయా ఆద్మీ’ ‘చండీరాణి’ అనే రెండు సినిమాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించారు.ఇక  గతేడాది ఆయన జీవితంపై ఆయన తనయుడు ‘ఎన్టీఆర్ కథానాాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించాడు. ఇక ఆయన జీవిత చరమాంకంలో జరిగిన రాజకీయాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రూపొందించాడు. ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోలేదు.

Lakshmi's Ntr movie trailer is the main reason for NTR Mahanayakudu disappointment pk.. ఇప్ప‌టికే ఈ చ‌ర్చ మొద‌లైపోయింది. అప్పుడేమో క‌థానాయ‌కుడు విడుద‌లైన‌పుడు ‘మ‌హాన‌టి’ సినిమాతో పోల్చారు. ఆ సినిమా సాధించిన విజ‌యం చూసిన త‌ర్వాత క‌థానాయ‌కుడు కూడా సావిత్రి బ‌యోపిక్‌తో పోల్చేసారు అభిమానులు. ఇక ఇప్పుడు కూడా మ‌హానాయ‌కుడు వంతు. ఈ సినిమాను ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో పోలుస్తూ క‌మెంట్స్ చేస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు. ntr mahanayakudu review,ntr mahanayakudu collections,balakrishna ntr mahanayakudu movie,lakshmi's ntr mahanayakudu,lakshmi's ntr mahanayakudu movies,lakshmi's ntr trailer shock to NTR Mahanayakudu,lakshmi's ntr release date,varma lakshmi's ntr,ntr mahanayakudu ww collections,telugu cinema,లక్ష్మీస్ ఎన్టీఆర్,ఎన్టీఆర్ మహానాయకుడు లక్ష్మీస్ ఎన్టీఆర్,లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ మహానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు కలెక్షన్స్,మహానాయకుడు ఓపెనింగ్స్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన బయోపిక్స్


చలన చిత్ర రంగంలో చెరగని ముద్ర వేసిన రామారావు.. ఆయన జీవిత చరిత్రపై తీసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.ఏమైనా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్ ది తిరుగులేని ప్రస్థానం అనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: NTR, NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు