సీనియర్ హీరో వెంకటేష్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

సీనియర్ హీరో వెంకటేష్ .. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ధనుశ్ హీరోగా హిట్టైన ‘అసురన్’ మూవీకి రీమేక్. తాజాగా మరో క్రేజీ ప్రాజెకట్ చేసేందకు రెడీ అవుతున్నాడు.

news18-telugu
Updated: July 10, 2020, 8:18 AM IST
సీనియర్ హీరో వెంకటేష్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్..
వెంకటేష్ Photo : Twitter
  • Share this:
సీనియర్ హీరో వెంకటేష్ .. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ధనుశ్ హీరోగా హిట్టైన ‘అసురన్’ మూవీకి రీమేక్. ఈ చిత్రం తర్వాత వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. దాంతో పాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను తరుణ్ భాస్కర్.. గుర్రపు పందాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు వెంకటేష్.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమాను రానాతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ పై దృష్టి సారించినట్టు సమాచారం. ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్.. దృశ్యం సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. ఒకవేళ సినిమా రిలీజై హిట్టైయితే.. తెలుగు ఈ చిత్రానికి సంబందించిన సీక్వెల్‌ను రీమేక్  చేయాలనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నట్టు సమాచారం. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ సినిమాను   ఇప్పటికే తెలుగులో వెంకటేష్, మీనాతో కలిసి ‘దృశ్యం’ పేరుతోనే  రీమేక్ చేసి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఒకవేళ ‘దృశ్యం’ సీక్వెల్ హిట్టైయితే.. తెలుగులో ఈ సినిమాను వెంకటేష్ చేయడం పక్కా అని చెబుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 10, 2020, 8:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading