హాస్పిటల్‌లో చేరిన మురళీ మోహన్.. పరామర్శించిన మెగస్టార్ చిరంజీవి దంపతులు..

మురళీ మోహన్‌ను పరామర్శించిన ,చిరంజీవి దంపతులు

ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం నేత మురళీమోహన్‌ వెన్నుపూసకు సంబంధించిన నొప్పితో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.తాజాగా ఆపరేషన్ పూర్తి చేసుకున్న మురళీ మోహన్‌కు చిరంజీవి దంపతులు పరామర్శించారు.

  • Share this:
    ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం నేత మురళీమోహన్‌ వెన్నుపూసకు సంబంధించిన నొప్పితో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. రీసెంట్‌గా మురళీ మోహన్ తల్లి వసుమతి దేవి అనారోగ్యంతో కన్నుమూయంతో ఆమె అస్థికలను గత నెల 14న  కలిపేందుకు వారణాసి వెళ్లారు. ఈ సందర్భంగా మురళీ మోహన్..అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెన్నుపూసకు సంబధించి ఆపరేషన్ చేయాలనడంతో గత నెల 24న మురళీ మోహన్‌కు కెేర్ హాస్పిటల్‌లో చికిత్స చేసారు. ఆపరేషన్ తర్వాత ఆయన ఇపుడిపుడే కోలుకుంటున్నారు. త కొంత కాలంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అందుకే ఈసారి ఆయన బదులు ఆయన కోడలు రూప రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆపరేషన్ పూర్తి చేసుకున్న మురళీ మోహన్‌కు చిరంజీవి దంపతులు పరామర్శించారు. అంతేకాదు ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్ధించారు.  ఈ సందర్భంగా మురళీ మోహన్ మట్లాడుతూ.. త్వరలోనే నేను కోలుకొని ప్రజలను అభిమానులను కలుస్తానని చెప్పారు.
    First published: