మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి టాకే వచ్చినా.. ఆశించినంత విజయం సాధించలేకపోయింది. నైజాం, ఉత్తరాంధ్ర తప్పించి మిగతా ఏరియాల్లో ‘సైరా’ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక హిందీ, తమిళం సహా మిగతా భాషల్లో ఈ సినిమాకు కనీస వసూళ్లు దక్కలేదు. తాజాగా ఈ సినిమాపై సీనియర్ నటుడు గిరిబాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా ఓ ఫంక్షన్‌లో చిరంజీవిని కలిస్తే మాటల సందర్భంలో ఆయన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నట్టు తనతో చెప్పారని గుర్తు చేసారు. అపుడే నేను ఇలాంటి సినిమాను ఎందుకు ఎంచుకున్నారని ఆయన్ని ప్రశ్నించాను. దానికి బదులు వేరే ఏదైనా సోషల్ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు కదా అన్నాను. అప్పటి చరిత్రను ఇపుడు తీస్తే.. ఇప్పటి జనరేషన్ ఎవరు చూస్తారని అన్నాను. బాహుబలి లాంటి సినిమాలు చేస్తే చూస్తారు కానీ.. ఇప్పటి జనరేషన్‌కు ఈ స్టోరీ అంతగా ఎక్కదని చెప్పాను.
ఇక అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి సినిమాల టైమ్ వాళ్లకు స్వాతంత్య్ర ఉద్యమం నాటి సంగతులు తెలుసు కాబట్టి ఆయా సినిమాలు ప్రేక్షకులు చూసారన్నారు. అందుకే సైరా సినిమా ఇప్పటి జనరేషన్ అంతగా ఓన్ చేసుకోలేపోయిందని గిరిబాబు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Ram Charan, Surender reddy, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood