Home /News /movies /

SENIOR PRODUCER M RAMAKRISHNA REDDY PASSES AWAY SLB

M Ramakrishna Reddy Death: టాలీవుడ్‌‌లో మరో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత

Photo Twitter

Photo Twitter

టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి (Producer M Ramakrishna Reddy) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 76 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

కరోనా మొదలు సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి (Producer M Ramakrishna Reddy) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 76 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ స్టోక్‌తో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. ఆయన హఠాన్మరణంతో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకానొక సమయంలో తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎం రామకృష్ణారెడ్డి కన్నుమూశారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఎం రామకృష్ణారెడ్డి నిర్మించిన సినిమాల్లో ''అభిమానవంతులు, వైకుంఠపాళి, అల్లుడు గారు జిందాబాద్‌, మూడిళ్ల ముచ్చట, మాయగాడు, సీతాపతి, అగ్ని కెరటాలు చెప్పుకోదగినవి. 1948 మార్చి 8న నెల్లూరు జిల్లా గూడురులో శ్రీమతి మస్తానమ్మ- ఎం సుబ్బరామరెడ్డి దంపతులకు జన్మించిన ఎం రామకృష్ణారెడ్డి మైసూర్‌ యూనివర్సిటీలో బీఈ పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన బంధువైన ఎం ఎస్‌రెడ్డి సహకారంతో చిత్రలోకి వచ్చి తన మార్క్ చూపించారు.

1973లో శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్ (Sri Ramakrishna Films) అనే నిర్మాణ సంస్థను స్థాపించి రంగనాథ్ (Ranganath), శారద (Sarada) జంటగా అభిమానవంతులు సినిమా రూపొందించారు. ఈ సినిమాలో ఎస్వి రంగారావు (SV Ranga Rao), రాజబాబు (Rajababu), అంజలీ దేవి (Anjali Devi), రమాప్రభ (Rama Prabha) ముఖ్య పాత్రల్లో నటించారు. వాకాడ అప్పారావుతో కలిసి ఆయన `మూడిళ్ల ముచ్చట` సినిమా చేశారు. ఈ మూవీలో చంద్ర మోహన్ హీరోగా నటించారు. కృష్ణ హీరోగా అగ్ని కెరటాలు, శోభన్ బాబు హీరోగా అల్లుడు గారు జిందాబాద్ చిత్రాలు చేసి మంచి మార్కులు కొట్టేశారు. అలాగే అమ్మోరు తల్లి సినిమాను డబ్ చేశారు. రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నట్లు సమాచారం.
Published by:Sunil Boddula
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు