బాలకృష్ణ అలా అనడం తప్పు.. ఆ నిర్మాత సంచలనం..

Balakrishna: ఒక్కసారిగా బాలయ్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి తెర తీస్తున్నాయి. ఇండస్ట్రీలో చాలా గ్రూపులు ఉన్నాయని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 5:19 PM IST
బాలకృష్ణ అలా అనడం తప్పు.. ఆ నిర్మాత సంచలనం..
గతంలో సీఎం జగన్ తన అభిమాని అనే విషయం తనకు తెలుసు అని వివరించారు.
  • Share this:
ఒక్కసారిగా బాలయ్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి తెర తీస్తున్నాయి. ఇండస్ట్రీలో చాలా గ్రూపులు ఉన్నాయని.. రాజకీయాలు జరుగుతున్నాయని ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చినట్లైంది. చిరంజీవి ఇంట్లో జరుగుతున్న మీటింగ్స్ గురించి తనకు తెలియదని.. అసలు ఇండస్ట్రీలో కూడా తననెవరూ పిలవలేదని బాలయ్య చెప్పడం సంచలనంగా మారింది. బాలయ్య లాంటి స్టార్ హీరోను పిలవకుండా చిరంజీవి ఇంట్లో ఏం చేస్తున్నారంటూ అభిమానులు కూడా మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)
బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)


అభిమానులు కూడా తమ హీరోను ఒంటరిని చేసారంటూ ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నిర్మాత సి కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. విషయం తెలిసిన తర్వాత తానే స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడానని చెప్పాడు సి కళ్యాణ్. ఇండస్ట్రీలో సమస్యలపై తనకు కూడా స్పందించాలని ఉంటే రావాల్సిందని తెలిపాడు కళ్యాణ్. ఇండస్ట్రీలో ఇకపై మీటింగ్స్ ఉంటే పిలుస్తామని.. కానీ ఉండకపోవచ్చంటూ కామెంట్ చేసాడు సి కళ్యాణ్.
బాలయ్య సి కళ్యాణ్ (balakrishna c kalyan)
బాలయ్య సి కళ్యాణ్ (balakrishna c kalyan)

షూటింగ్స్ లేని సమయంలో తలసానితో కలిసి హైద్రాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య అనడం.. ఇండస్ట్రీ కోసం జరుగుతున్న మీటింగ్స్‌ను రియల్ ఎస్టేట్ అనడం తప్పు అంటున్నాడు బాలయ్య. ఆయనకు అలా అనిపించిందేమో అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్. షూటింగ్స్ ఆగిపోవడంతో నిర్మాతలంతా కలిసి ప్రభుత్వాన్ని అనుమతి కోసం కలిసామని.. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయడం లేదు కాబట్టి రాలేదేమో అన్నాడు ఈయన. అవసరమైనప్పుడు బాలయ్య తమతో చర్చల్లో పాల్గొంటాడని క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్. ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని.. ఇక్కడ ఎవరి మధ్య విభేదాలు లేవని.. గ్రూపు రాజకీయాలు లేవని చెప్పాడు ఈయన.
First published: May 28, 2020, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading