ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలుగా లింగారెడ్డి గునపనేని సహ నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా ‘అరి’ (Ari). మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉప శీర్షిక. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయ శంకర్ (Jaya Shankar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం అరి. తాజాగా ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ (Aswani Dutt) చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు.
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ అరి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు. రెండు నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో అనసూయకు సంబంధించిన సన్నివేశాలు మేజర్ హైలైట్ అయ్యాయి. అరి టైటిల్‌తోనే ప్రేక్షకుల చూపు ఈ సినిమాపై పడేలా చేసిన డైరెక్టర్ జయ శంకర్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి జనాల్లో అంచనాలు నెలకొల్పారు.
ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ.. ''ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి చిత్ర ట్రైలర్ ను చూశాను. చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. పర్టిక్యులర్ గా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా.. మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. ట్రైలర్ చూడగానే టెక్నీషియన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. మంగ్లీ పాడిన పాట కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను'' అన్నారు.
ఈ సంధర్భంగా అశ్వనీదత్ గారికి దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేశారు. విడుదలకు రెడీగా ఉన్న ‘అరి’చిత్రంలో అనసూయ భరద్వాజ్ , సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Aswani Dutt, Tollywood