Home /News /movies /

SENIOR NTR MOVIES LIST AND HIS SUCCESS TRACK LIST MHN

Senior ntr- Movies: స్వ‌రీయ ఎన్‌.టి.ఆర్‌ సినిమాలెన్ని.. అందులో హిట్స్‌..సూప‌ర్‌హిట్స్‌, బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్‌, సిల్వ‌ర్ జూబ్లీలెన్నో తెలుసా?

Senior NTR movies list and his success track list

Senior NTR movies list and his success track list

Senior ntr- Movies: స్వర్గీయ నందమూరి తారక రామారావు నటుడిగా, రాజకీయ వేత్తగా తనదైన ముద్ర వేశారు. అసలు ఆయన కెరీర్లో ఎన్ని సినిమాలు చేశారు. సక్సెస్ రేటు ఎంతో తెలుసా?

    తెలుగువాడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటిన నేత స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు. సినీ ఇండ‌స్ట్రీకి మూల‌స్థంభాలైన ఇద్ద‌రు హీరోల్లో మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్న తిరుగులేని అగ్ర క‌థానాయ‌కుడు. సాంఘిక‌, పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్రక చిత్రాల్లో న‌టించి త‌న‌లాంటి పాత్ర‌లు మ‌రెవరూ చేయ‌లేర‌ని ప్రూవ్ చేసిన న‌ట సార్వ‌భౌముడు. కృష్ణుడు, రాముడు, ధుర్యోధ‌నుడు, రావ‌ణాసురుడు, భీముడు, అర్జునుడు.. ఏ పౌరాణిక పాత్ర అయినా ఆయ‌న త‌ర్వాతే .. అన్నంత‌లా ఒదిగిపోయిన మ‌హా న‌టుడు ఎన్టీఆర్‌. ఆయ‌న 25వ వ‌ర్ధంతి నేడు.

    అస‌లు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేశాడు.. అందులో హిట్స్ ‌..సూప‌ర్‌హిట్స్‌, బ్లాక్ ‌బ‌స్ట‌ర్స్‌, సిల్వ‌ర్ జూబ్లీలెన్నో తెలుసా? ఆ వివ‌రాలు మీకోసం..ఎన్టీఆర్ మొత్తంగా 302 సినిమాల్లో న‌టించారు. అందులో 275 సినిమాలు హిట్స్ అయ్యాయి. 23 సినిమాలు సంవ‌త్స‌రం పాటు ర‌న్ అయ్యాయి. 94 సినిమాలు 300 రోజులు పాటు ఆడాయి. 185 సినిమాలు 175 రోజులు ఆడాయి. రిపీట్ ర‌న్‌లో 28 సినిమాలు వంద రోజులు ఆడాయి. రిపీట్‌లో 52సినిమాలు యాబై రోజులు అడాయి.

    ఎన్టీఆర్ చేసిన 302 చిత్రాల్లో 48 పౌరాణికాలు, 18 చారిత్ర‌క చిత్రాలు ఉన్నాయి. వీటిలో 17 సార్లు కృష్ణుడిగా క‌నిపించారు. 32సార్లు డ్యూయెల్ పాత్ర‌ల‌ను పోషించారు. 18 సినిమాల‌కు స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 35 సంవత్స‌రాల సినీ జీవితంలో 95 మంది ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేశారు. ఇక రాజ‌కీయాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌న‌క్క‌ర్లేదు. మూడు సార్లు ముఖ్య‌మంత్రి అయ్యారు. 13 సంవత్స‌రాల పాటు ముఖ్య‌మంత్రిగా రాష్ట్రానికి సేవ‌లు అందించారు.
    Published by:Anil
    First published:

    Tags: Nandamuri, NTR

    తదుపరి వార్తలు