తన తల్లి విజయ నిర్మల బయోపిక్ పై నరేష్ కీలక వ్యాఖ్యలు..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులో సినీ నటులకు సంబంధించిన బయోపిక్‌లు ఒక దాని వెంబడి మరోకటి వస్తున్నాయి. తాజాగా తన తల్లి విజయ నిర్మల బయోపిక్ వస్తున్న వార్తలపై ఆమె తనయుడు నరేష్ స్పందించారు.

news18-telugu
Updated: April 29, 2020, 6:32 AM IST
తన తల్లి విజయ నిర్మల బయోపిక్ పై నరేష్ కీలక వ్యాఖ్యలు..
కృష్ణ, విజయ నిర్మలతో సీనియర్ నటుడు నరేష్ (ట్విట్టర్ ఫోటోస్)
  • Share this:
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులో సినీ నటులకు సంబంధించిన బయోపిక్‌లు ఒక దాని వెంబడి మరోకటి వస్తున్నాయి. ఇప్పటికే మహానటుడు ఎన్టీఆర్ జీవితంపై ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. మరోవైపు మహానటి సావిత్రిపై ‘మహానటి’ బయోపిక్ తెరకెక్కింది. ఈ సినిమాలో సావిత్ర పాత్రలో కీర్తి సురేష్  పరకాయ ప్రవేశం చేసి ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమేఈ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన హీరోయిన్ జయలలిత జీవితంపై ఒకటికి నాలుగు బయోపిక్‌కు తెరకెక్కుతున్నాయి.  తాజాగా తెలుగులో హీరోయిన్‌గా నిర్మాతగా, దర్శకురాలిగా చెరగని ముద్ర వేసిన విజయనిర్మల జీవితంపై ఓ సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలోని అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. అందులో ఎక్కువ చిత్రాలు తన భర్త సూపర్ స్టార్ కృష్ణతోనే నిర్మించడం విశేషం.

senior naresh denied about his mother vijaya nirmala biopic here are the details,vijaya nirmala,vijaya nirmala biopic,senior naresh,senior naresh denied about his mother biopic,vijay nirmala biopic,Keerthy Suresh,Keerthy Suresh twitter,Keerthy Suresh instagram,Keerthy Suresh vijaya nirmala biopic,Keerthy Suresh vijaya nirmala role,Keerthy Suresh bollywood entry,Keerthy Suresh hot photos,Keerthy Suresh mahanati,Keerthy Suresh mahanati awards,Keerthy Suresh bollywood movie,Keerthy Suresh boney kapoor movie,Keerthy Suresh movies,,Keerthy Suresh  pawan kalyan,telugu cinema,కీర్తి సురేష్,కీర్తి సురేష్ తెలుగు సినిమాలు,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ బాలీవుడ్,విజయ నిర్మల పాత్రలో కీర్తి సురేష్,విజయ నిర్మల బయోపిక్,విజయ నిర్మల బయోపిక్ పై నరేష్ కీలక వ్యాఖ్యలు,విజయ నిర్మాల బయోపిక్ తెరకెక్కడం లేదు
భర్త కృష్ణతో విజయ నిర్మల


ఇక మహానటిలో సావిత్ర పాత్రను పోషించిన కీర్తి సురేష్ ఈ క్యారెక్టర్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా తన తల్లి బయోపిక్ పై వస్తున్న వార్తలను విజయ నిర్మాల అబ్బాయి సీనియర్ హీరో నరేష్ కొట్టిపారేసారు. అమ్మ పేరుతో బయోపిక్ నిర్మించడం లేదన్నారు. ఇతరులు ఎవరికీ బయోపిక్ పర్మిషన్స్ కూడా ఇవ్వలేదన్నారు. దీంతో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న విజయ నిర్మల బయోపిక్ వార్తలపై తెరపడ్డటయింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 29, 2020, 6:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading