సీనియర్ హీరోయిన్ రాశి పెళ్లి చేసుకోవాలనకున్న హీరో ఎవరంటే..

దాదాపు రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. అంతకు ముందు బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది. తాజాగా ఈ సీనియర్ భామ... ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

news18-telugu
Updated: November 13, 2019, 8:46 AM IST
సీనియర్ హీరోయిన్ రాశి పెళ్లి చేసుకోవాలనకున్న హీరో ఎవరంటే..
రాశి (Youtube/Photo)
  • Share this:
దాదాపు రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. అంతకు ముందు బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది. తాజాగా ఈ సీనియర్ భామ... ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలనటిగా ఉన్నపుడు సినిమాల ప్రివ్యూలు చూసేందుకు పాస్‌లు వచ్చేవి. ఆ సమయంలో నేను ఎక్కువగా వెంకీ సినిమాలను చూసినట్టు చెప్పుకొచ్చారు.ఆ టైమ్‌లో వెంకటేష్ అంటే క్రష్ ఏర్పడింది. అలా ప్రేమగా మారింది. దీంతో పెద్దయ్యాక ఎవరిని పెళ్లాడుతావు అని చాలా మంది నన్న అడిగితే... హీరో వెంకటేష్ అని తడుముకోకుండా సమాధానం  చెప్పేదాన్ని. ఇక వెంకటేష్‌తో శ్రీను సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసినట్టు చెప్పారు. కాని కాస్తా పెరిగి పెద్దయ్యాక దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఇష్టం పెరిగి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టిందన్నారు.  మరోవైపు నేను బాలనటిగా బాలయ్యబాబుతో ‘బాల గోపాలుడు’ సినిమా చేసాను. ఆ తర్వాత ఆయనతో ‘కృష్ణబాబు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నపుడు ఎలా అయితే.. పలకరించేవారో.. నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నన్ను ఆయన అలాగే పలకించేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పధ్నాలుగేళ్లకే హీరోయిన్ కావడంతో చాలా సరదగా ఉండేదన్నారు.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...