• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SENIOR HEROIN NAGMA FIRES ON KANGANA OVER KANGANA RANAUT NEPOTISM COMMENTS OVER SUSHANT SINGH RAJPUT SUICIDE TA

యంగ్ రెబల్ ప్రభాస్ హీరోయిన్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అత్త ఫైర్..

యంగ్ రెబల్ ప్రభాస్ హీరోయిన్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అత్త ఫైర్..

ఎన్టీఆర్,ప్రభాస్ (File/Photo)

మయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోయిన్ పై ఎన్టీఆర్ అత్త ఫైర్ అయింది. ప్రభాస్ భామపై ఎన్టీఆర్ అత్త అని ఆశ్యర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    మయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోయిన్ పై ఎన్టీఆర్ అత్త ఫైర్ అయింది. ప్రభాస్ భామపై ఎన్టీఆర్ అత్త అని ఆశ్యర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ హీరోగా నటించిన అల్లరి రాముడు సినిమలో అత్తగా నటించిన నగ్మా .. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్‌గా నటించిన కంగనా రనౌత్ పై ఫైర్ అయింది. గత నెలలో సుశాంత్ సింగ్.. తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌లో ఉన్న నెపొటిజం (వారసత్వం)  కారణంగా సుశాంత్ సూసైడ్ చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా బాలీవుడ్‌‌లో నెలకొన్న నెపోటిజంపై  ముందు నుంచి ఫైర్ అవుతూనే ఉంది. ఈ సందర్భంగా నెపోటిజంపై కంగనా చేస్తోన్న వ్యాఖ్యలపై ఒకప్పటి గ్లామర్ క్వీన్ నగ్మా స్పందించింది. అంతేకాదు కంగాన చేస్తోన్న నెపోటిజం వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కంగనా తన కెరీర్ తొలినాళ్లలో ఇమ్రాన్ హష్మి కథానాయికుడిగా మహేష్ భట్ నిర్మాణంలో తెరకెక్కిన ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈమె తొలిసారి హీరోగా నటించిన ఇమ్రాన్ హష్మి... మహేష్ భట్ మేనల్లుడు. అతనితో నటించడం అంటే నెపోటిజాన్ని సమర్ధించడమేగా అని చెప్పుకొచ్చింది.


    కంగనా రనౌత్ .. ఆదిత్య పాంచోలిని తనకు సినీ ఇండస్ట్రీలో మెంటర్‌ అని చాలా సందర్భాల్లో  చెప్పుకొచ్చింది. అతని కారణంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కంగనా నెపొటిజాన్నిసమర్ధించడమే అవుతోంది. అటు హృతిక్ రోషన్‌తో ‘క్రిష్ 3’ సినిమాలో నటించింది. అతనితో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది. అపుడు కంగనా,  హృతిక్‌తో తిరగడం నెపోటిజాన్ని సమర్ధించడమే కాదా అని నగ్మా చెప్పుకొచ్చింది. సుశాంత్ మరణంతో ఇన్ని సుద్దులు చెప్పే కంగనా తన పర్సనల్ అసిస్టెంట్‌గా తన సోదరి రంగోలిని పెట్టుకోవడం నెపోటిజన్ని ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించింది. మొత్తంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌లో నెపోటిజం ఉందని మొత్తుకుంటున్న కంగనా రనౌత్.. ఆయన బతికి ఉన్నపుడు ఎందుకు స్పందించలేదో తెలపాలన్నారు.

    నగ్మా, కంగనా రనౌత్ (Twitter/Photo)


    సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈమె బాలీవుడ్‌లో ఎవరు లేనట్టు నెపోటిజంపై పోరాటం అంటూ నాటాకాలు చేస్తుందంటూ దుమ్మెత్తి పోసింది నగ్మా. ఇక బాలీవుడ్‌లో ప్రొడక్షన్ హౌస్‌తో పాటు ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఏక్తా కపూర్.. సోదరుడు తుషార్ కపూర్.. యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా హీరోలుగా సక్సెస్ కాలేకపోయారంటూ ఈ సందర్భంగా ప్రస్తావించింది. బాలీవుడ్‌లో నెపోటిజమే  ఉంటేనే సక్సెస్ కారు. టాలెంట్ ఉంటేనే పైకి వస్తారన్న విషయాన్ని నగ్మా కంగనాకు ఈ సందర్భంగా గుర్తు చేసింది. మరి నగ్మా మాటలకు కంగాన కూడా స్పందించింది.


    తనను ఆదిత్య పాంచోలి ఎంతో టార్చర్ పెట్టినట్టు ఎన్నోసార్లు చెప్పానని గుర్తుకు చేసింది. అంతేకాదు తనను గ్యాంగ్ స్టర్ మూవీలో ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసారు.అందులో ఎలాంటి నెపోటిజం లేదు. అంతకు ముందు అనురాగ్ బసుకు నేను ఎవరో తెలియదు. అతను కూడా ఎన్నో సందర్భాల్లో ఈ విషయమై స్పందించారు. క్రిష్  సినిమా కోసం అంతకు ముందే సైన్ చేసాను ఆ రత్వాత కైట్స్ సినిమాలో తనకు వచ్చిన అవకాశాన్ని కూడా తప్పించారంది. కొన్ని ఏజెన్సీస్‌కు నేనంటే గిట్టదు ఎందుకంటే నేను ఏ అవార్డ్ ఈవెంట్‌లో డాన్స్ గట్రా  చేయను. అందుకే వాళ్లకు నేనంటే కోపం అంటూ నగ్మాకు రివర్స్ కౌంటర్ వేసింది కంగనా.


    అందుకే నేను ఎలాంటి ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్‌లో నటించలేదు. నేను డబ్బులు ఇచ్చి వేరే వాళ్లను పెట్టుకునే స్థోమత నాకు లేదు. నా డేట్స్ అన్ని నా సోదరి రంగోలి చూస్తుంది. ఆమెకు సరిగా ఇంగ్లీష్ కూడా రాదు. వేరే వాళ్లతో ఎలా డీల్ చేయాలో కూడా ఆమెకు తెలియదు. ఎవరైనా వారి కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తే  చూస్తూ ఊరుకోరు కదా. నా సోదరి రంగోలి కూడా నా విషయంలో జరుగుతోన్న అసత్య ప్రచారాలను ఎన్నో సార్లు ఖండించింది. ఇది తప్పేలా అవుతుందని అని నగ్మాకు కాస్తా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది కంగనా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు