Ramya Krishna: చిక్కుల్లో రమ్యకృష్ణ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

బాహుబలిలో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత నటిగా రమ్యకృష్ణ క్రేజ్ పెరిగింది. తాజాగా ఈ సీనియర్  హీరోయిన్ అనుకోని చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే.. 


Updated: September 14, 2019, 1:46 PM IST
Ramya Krishna: చిక్కుల్లో రమ్యకృష్ణ.. ఇంతకీ ఏం జరిగిందంటే..
రమ్యకృష్ణ (Twitter/Photo)

Updated: September 14, 2019, 1:46 PM IST
బాహుబలిలో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత నటిగా రమ్యకృష్ణ క్రేజ్ పెరిగింది. తాజాగా ఈ సీనియర్  హీరోయిన్ అనుకోని చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే..  ప్రస్తుతం రమ్యకృష్ణ.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు ‘క్వీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్‌గా రాబోతుంది. తొలి సీజన్ 10 భాగాలుగా ప్రేక్షకుల ముందు రానుంది. దీనికి వచ్చే రెస్పాన్స్ వచ్చి.. రెండో సీజన్‌ను తెరకెక్కిస్తారట. ఈ వెబ్ సిరీస్‌ను ఒకేసారి తమిళంతో పాటు తెలుగు, హిందీలో తెరకెక్కించనున్నారు.

ramya krishna play Jayalalithaa biopic in web series as title queen,ramya krishna,ramya krishna movies,ramya krishna as jayalalithaa,Jayalalithaa biopic,Jayalalithaa biopic in web series,jayalalithaa web series queen,jayalalithaa queen,jayalalithaa,ramya krishna in as jayalalithaa,ramya krishna in jayalalitha biopic,actress ramya krishna,ramya krishna in baahubali,jayalalithaa biopic,ramya krishna in jayalalithaa biopic,ramya krishnan,jayalalitha,jayalalitha biopic,ramya krishnan as jayalalithaa,ramya krishna as jayalalitha,ramya krishna remuneration for jayalalitha biopic,kollywood,tollywood,bollywood,జయలలిత,జయలలిత రమ్యకృష్ణ,జయలలిత రమ్యకృష్ణ,జయలలిత బయోపిక్ టైటిల్ క్వీన్,జయలలితగా రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల,క్వీన్ టైటిల్‌తో తెరకెక్కనున్న జయలలిత వెబ్ సిరీస్,
‘క్వీన్’టైటిల్‌తో తెరకెక్కుతోన్న జయలలిత వెబ్ సిరీస్


తాజాగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. గౌతమ్ మీనన్‌తో పాటు ఈ చిత్ర నిర్మాతలు జయ లలిత వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు జయలలిత కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోలేదట. దీంతో జయలలిత మేనల్లుడు దీపక్ ఈ వెబ్ సిరీస్ విషయమై.. దర్శక,నిర్మాతలపై లీగల్‌గా ప్రొసీడ్ కావాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే కొంత మంది లాయర్లతో జయలలిత వెబ్ సిరీస్‌ విషయమై సంప్రదింపులు జరిపాడట. మరి ఈ వ్యవహారంపై దర్శక,నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...