బాహుబలిలో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత నటిగా రమ్యకృష్ణ క్రేజ్ పెరిగింది. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ అనుకోని చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే..
బాహుబలిలో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత నటిగా రమ్యకృష్ణ క్రేజ్ పెరిగింది. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ అనుకోని చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రమ్యకృష్ణ.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, మురుగేశన్ అనే దర్శకుడితో కలిసి తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు ‘క్వీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్‌గా రాబోతుంది. తొలి సీజన్ 10 భాగాలుగా ప్రేక్షకుల ముందు రానుంది. దీనికి వచ్చే రెస్పాన్స్ వచ్చి.. రెండో సీజన్‌ను తెరకెక్కిస్తారట. ఈ వెబ్ సిరీస్‌ను ఒకేసారి తమిళంతో పాటు తెలుగు, హిందీలో తెరకెక్కించనున్నారు.
‘క్వీన్’టైటిల్‌తో తెరకెక్కుతోన్న జయలలిత వెబ్ సిరీస్
తాజాగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. గౌతమ్ మీనన్‌తో పాటు ఈ చిత్ర నిర్మాతలు జయ లలిత వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు జయలలిత కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోలేదట. దీంతో జయలలిత మేనల్లుడు దీపక్ ఈ వెబ్ సిరీస్ విషయమై.. దర్శక,నిర్మాతలపై లీగల్‌గా ప్రొసీడ్ కావాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే కొంత మంది లాయర్లతో జయలలిత వెబ్ సిరీస్ విషయమై సంప్రదింపులు జరిపాడట. మరి ఈ వ్యవహారంపై దర్శక,నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.