• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SENIOR HERO SUMAN SENSATIONAL COMMENTS ON CHIRAJEEVI TA

మెగాస్టార్ చిరంజీవిపై సుమన్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవిపై సుమన్ సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..

సుమన్, చిరంజీవి

1980 దశకంలో టాలీవుడ్‌లో సుమన్ ఓ వెలుగు వెలుగుతున్న టైమ్‌లో బ్లూ ఫిల్మ్ కేసులో అరెస్ట్ కావడం అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. తాజాగా తన అరెస్ట్ విషయమై సుమన్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Share this:
1980 దశకంలో టాలీవుడ్‌లో సుమన్ ఓ వెలుగు వెలుగుతున్న టైమ్‌లో బ్లూ ఫిల్మ్ కేసులో అరెస్ట్ కావడం అప్పట్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఈ కేసులో సుమన్ దాదాపు మూడేళ్లు జైలు శిక్ష అనుభించాడు కూడా. ఐతే ఆయనపై చేసిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆయన ఈ కేసు నుంచి బయట పడ్డారు. ఈ కేసులో ఇరుక్కోవడంతో సుమన్ కెరీర్‌ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.ఆ తర్వాత నిలబడి తన సత్తా చాటినా.. హీరోగా మునుపటి వైభవాన్ని మాత్రం దక్కించుకోలేక రేసులో వెనకబడిపోయాడు.ఐతే ఈ కేసు విషయమై..సమన్‌ను ఇరికించింది చిరంజీవి ఫ్యామిలీ అనే రూమర్స్ కూడా వచ్చాయి. ఈ ఆరోపణలను సుమన్ సలు సందర్భాల్లో ఖండించారు కూడా. తాజాగా మరోసారి ఈ కేసు విషయమై సుమన్ మరోసారి స్పందించారు.

ఇది చిరంజీవి అంటే గిట్టని వాళ్లు చేసిన పుకారు అంటూ కొట్టిపడేసారు. చిరంజీవితో అప్పట్లో నాకు విషయమై అభిప్రాయ భేదాలుండేవి. కానీ ఈ కేసుతో చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఆ రోజుల్లో ఇంటర్నెట్, టీవీ చానెల్స్ లేవు. మేగజైన్లు, పేపర్లు మాత్రమే ఉండేవి. వారు కూడా తమ సర్కులేషన్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలు రాసేవారని సుమన్ గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి ఆ సంఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఫ్రెండ్స్ కొందరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వారు నా కారులో అమ్మాయిని తీసుకెళ్లారు. అదే నాకు సమస్యగా  మారి జైలుకు వెళ్లాల్సివచ్చింది. నేను ఏ తప్పు చేయలేదని తెలిసి నన్ను నిర్దోషిగా విడుదల చేసారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

1985 మే 19న నన్ను అరెస్ట్ చేశారు. 1989లో నిర్దోషిగా బయటకు వచ్చాను. నాపై నమోదైన ఎఫ్ఐఆర్, సహా చార్జ్‌షీట్ ఏది ప్రూవ్ కాలేదు. నేను తప్పుచేసినట్టు ఆధారాలు లేవు. అంతేకాదు ఆ నేరం జరిగిన సమయంలో నేను షూటింగ్‌లో ఉన్నాను. ఆ తర్వాత ఒరిజినల్ క్రిమినల్స్‌ ఎవరిని కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. నా పరిస్థితికి కారణమైన వారిపై సినిమాల్లో  మాదిరి ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి..నా పనేదే నేను చేసుకుంటూ వెళ్లిపోయాను.
First published:

అగ్ర కథనాలు