విలన్‌గా శ్రీకాంత్ (Srikanth as villain)
తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీకాంత్. ఈయన 100 సినిమాలకు పైగానే హీరోగా నటించాడు. ఆ తర్వాత మెల్లగా కెరీర్ డౌన్ అయిపోయింది. కొన్నేళ్లుగా శ్రీకాంత్ సినిమాలు ఒక్కటి కూడా రావడం లేదు. ఈయన హీరోగా నటించిన సినిమాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. దాంతో హీరోగా రిటైర్ అయిపోయి కారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు విలన్‌గా కూడా మారుతున్నాడు. ఇప్పటికే మూడేళ్ల కింద నాగ చైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణంలో విలన్‌గా నటించినా.. అది డిజాస్టర్ కావడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు శ్రీకాంత్‌కు సంచలన ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

విలన్‌గా శ్రీకాంత్ (Srikanth as villain)
బాలయ్య సినిమాలో ఈయన్నే మెయిన్ విలన్‌గా తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. కెరీర్ మొదట్లో విలన్‌గా నటించి హీరోగా మెప్పించిన శ్రీకాంత్.. ఇప్పుడు మళ్లీ ప్రతినాయకుడిగా మారుతున్నాడు. యుద్ధం శరణం తర్వాత మరే సినిమాలోనూ విలన్‌గా నటించలేదు శ్రీకాంత్. కానీ ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్‌గా చేస్తే మాత్రం అదిరిపోవడం ఖాయం అంటున్నారంతా. ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి ఆఘోరా కూడా. ఆ పాత్రపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు బోయపాటి శ్రీను. పైగా కవల పిల్లలుగా బాలయ్య కనిపించబోతున్నాడు.

బాలయ్య శ్రీకాంత్ ఫైల్ పోటోస్
ఈ సినిమాలో చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదని తెలుస్తుంది.. కేవలం ఎమోషనల్ నేపథ్యంలోనే కథ నడిపించాలని ఫిక్సైపోయాడు బోయపాటి. ఇదిలా ఉంటే గతంలో లెజెండ్ సినిమా తర్వాత జగపతిబాబు రేంజ్ మారిపోయింది. ఇప్పుడు శ్రీకాంత్ రేంజ్ కూడా ఇలాగే మారిపోతుందేమో అనుకుంటున్నారు ఈయన సన్నిహితులు. సింహ, లెజెండ్ లాంటి సినిమాల తర్వాత బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. గతంలో బాలయ్య శ్రీ రామరాజ్యం సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించాడు శ్రీకాంత్. ఇప్పుడు ఇదే శ్రీకాంత్ బాలయ్యకు ప్రతినాయకుడు అవుతున్నాడన్నమాట.
Published by:
Praveen Kumar Vadla
First published:
May 8, 2020, 3:35 PM IST