Home /News /movies /

SENIOR HERO RAJASEKHAR SEKHAR MOVIE WILL GOING TO BE RELEASED THIS SANKRANTI 2022 PK 2

Rajasekhar Shekar movie: సంక్రాంతి బరిలో రాజశేఖర్ ‘శేఖర్’.. త్వరలోనే ప్రకటన..

రాజశేఖర్ శేఖర్ సినిమా (Rajasekhar Shekar movie)

రాజశేఖర్ శేఖర్ సినిమా (Rajasekhar Shekar movie)

Rajasekhar Shekar movie: ఒకప్పుడు వరస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో యాంగ్రీ స్టార్ రాజశేఖర్. కొన్నేళ్లుగా ఈయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్' (Rajasekhar Shekar movie).

ఇంకా చదవండి ...
ఒకప్పుడు వరస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో యాంగ్రీ స్టార్ రాజశేఖర్. కొన్నేళ్లుగా ఈయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. మూడేళ్ళ కింద గరుడవేగ.. రెండేళ్ల కింద వచ్చిన కల్కి సినిమాలతో రాజశేఖర్‌ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాంతో మళ్ళీ వరస సినిమాలతో బిజీ అవుతున్నారు ఈయన. ప్రస్తుతం ఈయన నటిస్తున్న 91వ చిత్రం శేఖర్. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది.

బొరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవ‌ర్‌తో ఫ‌స్ట్ గ్లింప్స్‌ మొదలవుతుంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా.. ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 'శేఖర్'గా రాజశేఖర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. 'వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?' అని బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగులు వినిపిస్తూ ఉంటే.. స్ట‌యిలిష్‌గా సిగ‌రెట్ వెలిగిస్తూ రాజశేఖర్ స్క్రీన్ మీద కనిపిస్తారు.

Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. పంచాయితీలు చేయను.. చిరంజీవి కామెంట్స్..


సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుంది. రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్రయూనిట్ త్వరలోనే తెలియజేయనున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Rajasekhar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు