హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: సమంత ఐటెం సాంగ్ వల్లే అంతా జరిగింది.. సీనీయిర్ హీరో షాకింగ్ కామెంట్స్

Samantha: సమంత ఐటెం సాంగ్ వల్లే అంతా జరిగింది.. సీనీయిర్ హీరో షాకింగ్ కామెంట్స్

పుష్పలో సమంత ఐటెం సాంగ్

పుష్పలో సమంత ఐటెం సాంగ్

పుష్ప సినిమాలో సమంత నటించిన విషయం తెలిసిందే.ఆమె ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. పుష్ప ఎంత హిట్ అయ్యిందో సమంత చేసిన ఐటెం సాంగ్ కూడా అంతే హిట్ కొట్టింది.

పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా తెరకెక్కింది.  2021 డిసెంబర్ 17న విడుదలై మంచి సినిమా సూపర్ హిట్ అయ్యింది.బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో సమంత(Samantha)... ఐటెం సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా పుష్ప సినిమాపై సీనియర్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా సమంత వల్లే హిట్‌ అయ్యింది ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో భానుచందర్‌ అన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించిన ఆయన విషయాలపై మాట్లాడారు.

బాలీవుడ్‌ను టాలీవుడ్‌ ఓవర్‌ చేస్తుందని అందరు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్‌ అడగ్గా.. ఆయన అవును అన్నారు. 'ఇటీవల కాలంలో వచ్చిన ఎన్నో సౌత్‌ సినిమాలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో తెలిసిందే. ఇటీవల రిలీజ్‌ అయిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో చూశాం కదా. ముఖ్యంగా ఈ సినిమా ఆ ఒక్క పాట వల్లే పెద్ద హిట్‌ అయ్యింది. అదే ఊ అంటావా మావ.. ఊఊ ఉంటావా సాంగ్‌. సమంత నటించిన ఈ పాట తమిళం, మాళయాళంలో కూడా మారుమోగింది' అన్నారు. దీంతో ఇప్పుడు భాను చందర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టిపక్‌గా మారాయి.

ఇక పుష్ప (Pushpa) సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టించింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప.

పుష్ప సినిమా  ఈ రెండో పార్ట్‌ను సుకుమార్ దాదాపుగా 400 కోట్లతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ నెలలో మొదలుకావాల్సి ఉంది. అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యేలా లేదని టాక్.

First published:

Tags: Allu Arjun, Pushpa Movie, Samantha Ruth Prabhu

ఉత్తమ కథలు