హోమ్ /వార్తలు /సినిమా /

సభ్యతగా ఉంటే అందరికీ మంచిది.. ఎందుకంత చులకన చేస్తున్నారంటూ తమ్మారెడ్డి సీరియస్

సభ్యతగా ఉంటే అందరికీ మంచిది.. ఎందుకంత చులకన చేస్తున్నారంటూ తమ్మారెడ్డి సీరియస్

Photo twitter

Photo twitter

సామజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాలపై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తాజా ప్రెస్ మీట్‌లో ఆయన పేర్కొన్నారు.

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ అరచేతిలో ప్రపంచం కనిపించే రోజులు వచ్చేశాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ఊపందుకుంది. సామజిక మాధ్యమాల వేదికగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కామెంట్స్ చేసే వెసులుబాటు రావడంతో అది కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, ట్రోల్స్ వ్యక్తిగతంగా వారిని ఎంతో వేదనకు గురి చేస్తుండటం చూస్తున్నాం. తాజాగా ఈ ఇష్యూపై టాలీవుడ్ సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) సీరియస్ అయ్యారు. ఇకనైనా ఇలాంటివి మానుకుంటే మంచిదంటూ ఫేక్ న్యూస్ (Fake News) స్ప్రెడ్ చేసే వారిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న అసత్య ప్రచారాలపై హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీట్‌లో జీవితతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. ఇటీవల తాము దుబాయ్ వెళ్తే రాజశేఖర్ కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిందని రాశారని జీవిత తన ఆవేదన వెళ్లగక్కారు. ఇలాంటి వాటి వాళ్ల తమ జీవితాలు సఫర్ అవుతున్నాయని చెప్పిన జీవిత.. అందరూ ఇలా రాయలేదు కానీ వ్యూస్ కోసం కొందరు ఇలా రాయడం సరైన పద్దతి కానే కాదని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలాంటి రాతలు రాస్తూ దుష్ప్రచారం చేయడం మానుకోండని ఆమె కోరారు.

అనంతరం మాట్లాడిన తమ్మారెడ్డి.. సెలబ్రిటీలు కూడా మనుషులే అని, సోషల్ మీడియాలో వాళ్లపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం పద్దతి కాదని అన్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు మరీ ఎక్కువయ్యాయని, శృతిమించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని అన్నారు. అందరికీ కుటుంబాలుంటాయ్.. ఇలాంటి ఫేక్ వార్తలు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి తెలుపుతూ కేవలం వ్యూస్ కోసం ఇలా తప్పు వార్తలు పుట్టించి మీడియాను చులకన చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సభ్యతగా ఉండటం అందరికీ మంచిదంటూ అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్మారెడ్డి.

అదేవిధంగా ఇలాంటి ఫేక్ న్యూస్‌లను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ్మారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో కూడా నియమాలు పాటించడమనేది అవసరమని చెప్పిన ఆయన.. కంటెంట్ మీద విమర్శలు చేయడం వరకు ఓకే కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఏమాత్రం సహించదగినది కాదంటూ ఓపెన్ అయ్యారు.

First published:

Tags: Jeevitha, Jeevitha rajasekhar

ఉత్తమ కథలు