యాంకర్ ఝాన్సీకి వార్నింగ్ ఇచ్చిన ఆ ఛానెల్.. ఇంకోసారి అలా చేస్తే..

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది లేడీ యాంకర్స్‌లో ఝాన్సీ కూడా ఉంది. ఈమెకు మంచి ఇమేజ్ కూడా ఉంది. ఒకప్పుడు సుమ, ఉదయభానుతో కలిసి ఇండస్ట్రీని దున్నేసింది ఝాన్సీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2019, 2:19 PM IST
యాంకర్ ఝాన్సీకి వార్నింగ్ ఇచ్చిన ఆ ఛానెల్.. ఇంకోసారి అలా చేస్తే..
యాంకర్ ఝాన్సీ ఫైల్ ఫోటో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2019, 2:19 PM IST
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది లేడీ యాంకర్స్‌లో ఝాన్సీ కూడా ఉంది. ఈమెకు మంచి ఇమేజ్ కూడా ఉంది. ఒకప్పుడు సుమ, ఉదయభానుతో కలిసి ఇండస్ట్రీని దున్నేసింది ఝాన్సీ. ఇప్పుడు యాంకరింగ్ తక్కువ.. సినిమాలు ఎక్కువ చేసుకుంటూ తన పని తాను చేసుకుంటుంది ఈమె. అయితే ఇప్పుడు ఈ ప్రముఖ యాంకర్ వివాదాల్లో ఇరుక్కుంది. బిగ్ బాస్ షోను టార్గెట్ చేస్తూ ఝాన్సీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. బిగ్‌బాస్‌ షో కేవలం అబ్బాయిల కోసమే డిజైన్ చేసారా అనే అర్థం వచ్చేలా ఈమె చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు స్టార్ మా ఛానెల్‌కు కోపం తెప్పించినట్లు తెలుస్తుంది. అందులో ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్‌కు హోస్టుగా ఉంది ఝాన్సీ.
Senior Anchor Jhansi sensational and controversial comments on bigg boss 3 telugu show pk తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది లేడీ యాంకర్స్‌లో ఝాన్సీ కూడా ఉంది. ఈమెకు మంచి ఇమేజ్ కూడా ఉంది. ఒకప్పుడు సుమ, ఉదయభానుతో కలిసి ఇండస్ట్రీని దున్నేసింది ఝాన్సీ. anchor jhansi,anchor jhansi facebook,anchor jhansi twitter,anchor jhansi star maa,anchor jhansi bigg boss 3 telugu,anchor jhansi srimukhi,anchor jhansi bigg boss 3 rahul sipligunj,telugu cinema,యాంకర్ ఝాన్సీ,యాంకర్ ఝాన్సీ స్టార్ మా,యాంకర్ ఝాన్సీ బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
యాంకర్ ఝాన్సీ బిగ్ బాస్ 3పై పోస్ట్ చేసిన మెసేజ్

అందులోనే ఉంటూ.. అదే ఛానెల్‌కు వ్యతిరేకంగా కమెంట్స్ చేయడంతో ఇప్పుడు ఈమెపై ఫైర్ అవుతున్నారు నిర్వాహకులు. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 టైటిల్ గెలవటంపై ఝాన్సీ కొన్ని కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిగా చేయడానికి సిద్ధంగా లేనప్పుడు.. బిగ్ బాస్ షోలో శ్రీముఖిని తెలుగు ప్రేక్షకులు ఎలా గెలిపిస్తారు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. స్టార్ మా యాజమాన్యం ఈ కమెంట్స్‌పై కాస్త గుర్రుగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ మాలో ఝాన్సీ స్టార్ మ్యూజిక్ తెలుగు, స్టార్ట్ మా పరివార్ లాంటి షోలను చేస్తుంది. మరి ఇప్పుడు బిగ్ బాస్ షోపై ఈమె చేసిన కమెంట్స్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలిక.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...