Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: May 20, 2020, 3:16 PM IST
నాగబాబుపై విజయశాంతి సీరియస్ (naga babu vijayashanti)
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేను నిజమైన దేశ భక్తుడు అంటూ నాగబాబు అభివర్ణించడం ఇఫ్పుడు వివాదాస్పదంగా మారుతుంది. దీనిపై చాలా మంది తమ రియాక్షన్ చెప్తున్నారు. వర్మ లాంటి వాళ్లు మెగా బ్రదర్ నాగబాబును సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం నాగబాబును సపోర్ట్ చేసిన వాళ్లు కూడా పిచ్చోళ్లే.. విషయ పరిజ్ఞానం లేని వాళ్లే.. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దడానికి చేస్తున్న కుట్ర అంటూ మండి పడుతున్నారు. ఇప్పుడు నాగబాబు ట్వీట్‌పై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సీనియర్ నటి విజయశాంతి తన ట్విట్టర్లో స్పందించింది.
ఈ విషయంపై నాగబాబుపై సీరియస్ అయిపోయింది ఈమె. కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే... ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్... ''నాకు కూడా''.. అని గాడ్సే కనుక ఇప్పుడు బ్రతికుంటే... ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా" అని విజయశాంతి ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గాడ్సేపై నాగబాబు చేసిన ట్వీట్‌కు రియాక్షన్‌గానే ఈ ట్వీట్ చేసింది విజయశాంతి.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా నాగబాబు చేసిన ట్వీట్‌పై మండి పడుతున్నారు. పై నుంచి వాళ్లేం చెబితే అది చేస్తున్నారంటూ విహెచ్ ఆరోపించాడు. ఆయనతో పాటు మరికొందరు కూడా నాగబాబు చేసిన ట్వీట్‌పై సీరియస్ అయ్యారు. అయితే నాగబాబు మాత్రం తాను చేసింది తప్పు కాదని.. రెండు వైపులా ఆలోచిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్తున్నాడు. తాను గాడ్సే మరణ వాంగ్మూలం విన్నానని.. అందుకే తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఏదేమైనా కూడా ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ మాత్రం మంట పుట్టిస్తుంది. ఇదింకా ఎంత దూరం వెళ్తుందో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
May 20, 2020, 3:15 PM IST