Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: September 11, 2019, 5:28 PM IST
విజయశాంతి (File)
విజయశాంతి ఇప్పుడు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తుంది. ఒకప్పటిలా ఇప్పుడు కేవలం పాలిటిక్స్ మాత్రమే అనడం లేదు. దాంతో ఈమె ఈ సినిమాలు చేస్తుంది అంటూ రాములమ్మపై కొన్ని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి RRR సినిమాలో కూడా ఈమె నటిస్తుందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనిపై విజయశాంతి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చిందిప్పుడు. తాను రాజమౌళి సినిమాలో నటిస్తున్నాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అలాంటి న్యూస్ వస్తే కచ్చితంగా షేర్ చేసుకుంటానని చెబుతుంది ఈమె.

విజయశాంతి ఫైల్ ఫోటో
ప్రస్తుతం ఈమె మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రమే నటిస్తుంది. 13 ఏళ్ళ తర్వాత ఈమె నటిస్తున్న సినిమా ఇది. నాయుడమ్మ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన విజయశాంతి.. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా లేదు. పైగా మొన్న కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఈమె ఇప్పుడు చేయడానికి రాజకీయాలు కూడా మిగల్లేదు.

విజయశాంతి ఫైల్ ఫోటో (Source: Twitter)
దాంతో సినిమాల్లోకి వచ్చేస్తుంది ఈమె. ఇక్కడే మంచి పాత్రలు వస్తే చేస్తానంటుంది విజయశాంతి. అయితే విలన్ పాత్రలు మాత్రం చేయనని చెబుతుంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో కూడా అద్భుతమైన పాత్రలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది రాములమ్మ. రాజమౌళి సినిమా మాత్రం పూర్తిగా అబద్ధం అంటుంది విజయశాంతి.
Published by:
Praveen Kumar Vadla
First published:
September 11, 2019, 5:28 PM IST