నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కుమారుడు మృతి

ఒకప్పటి అందాల సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

news18-telugu
Updated: May 23, 2020, 1:51 PM IST
నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కుమారుడు మృతి
ఆత్మహత్య చేసుకున్న వాణిశ్రీ కుమారుడు Photo : Twitter
  • Share this:
ఒకప్పటి అందాల సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేష్ (36) మృతి చెందాడు. ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. నిద్రలోనే తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది. నటి వాణిశ్రీకి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్ గా పనిచేస్తున్న అభినయ్ ఈ రోజు తెల్లవారుజామున మరణించాడు. అభినయ్‌కు భార్యతో పాటు ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలుగా పనిచేస్తోంది. అభినయ్ గతంలో రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పనిచేశాడు. కుమారుడు మృతి చెందడంతో  వాణిశ్రీ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.  చెన్నైలోని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక మరోవైపు అభినయ్‌ మరణంపై తిరుక్కలి కుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆయన గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.  కుమారుడి హఠాన్మరణంతో వాణిశ్రీకి టాలీవుడ్‌ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading