హోమ్ /వార్తలు /సినిమా /

Vani Sri: వాణిశ్రీ ఆస్తి కబ్జా... రంగంలోకి దిగిన సీఎం.. !

Vani Sri: వాణిశ్రీ ఆస్తి కబ్జా... రంగంలోకి దిగిన సీఎం.. !

వాణిశ్రీకి సీఎం సాయం

వాణిశ్రీకి సీఎం సాయం

ప్రముఖ నటి వాణిశ్రీకి చెందిన దాదాపు రూ. 20 కోట్ల విలువైన ఈ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    ప్రముఖ నటి వాణిశ్రీ  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పేరు. అయితే కళాభినేత్రి అయిన వాణిశ్రీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది.  అప్పుడెప్పుడో కబ్జాకు గురైన తెలుగు, తమిళ సీనియర్ నటి వాణిశ్రీ భూమి తిరిగి ఆమె సొంతమైంది. దాదాపు రూ. 20 కోట్ల విలువైన ఈ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తాజాగా దీనిని రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం నిన్న ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా భూమి పత్రాలను ఆమెకు అందించారు.

    మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి వాటిని తిరిగి యజమానులకు అందించారు. అందులో వాణిశ్రీ కూడా ఉన్నారు.  భూమి పత్రాలను తీసుకునేందుకు సచివాలయానికి వచ్చిన వాణిశ్రీ మాట్లాడుతూ.. రూ. 20 కోట్ల విలువైన తన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారన్న విషయం తెలిసి తన ఆస్తి పోయిందనే అనుకున్నానన్నారు.  అయితే ఆశలు వదిలేసుకున్నానని అన్నారు.

    అయితే, గతేడాది నకిలీ పత్రాల ద్వారా జరిగిన భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని తీసుకొచ్చి తన భూమిని తనకు ఇప్పించినందుకు సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదని అనుకున్న సమయంలో ముఖ్యమంత్రి కల్పించుకుని తన భూమిని తిరిగి ఇప్పించారని పేర్కొన్నారు. ఆయన చల్లగా ఉండాలని, మంచి పాలన అందిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

    ఇక వాణిశ్రీ విషయానకి వస్తే.. ఆమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kollywood, MK Stalin, Vanisri

    ఉత్తమ కథలు