రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం.. డ్రైవర్ అరెస్ట్..

Ramya Krishna Car driver arrest: సీనియర్‌ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఈయన అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2020, 4:58 PM IST
రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం.. డ్రైవర్ అరెస్ట్..
రమ్యకృష్ణ Photo : Twitter
  • Share this:
సీనియర్‌ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఈయన అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రమ్యకృష్ణ కార్ డ్రైవర్ అరెస్ట్ కావడంతో పలురకాల అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని వాహనాలను చెక్ చేస్తున్న సమయంలోనే రమ్యకృష్ణ కారు కూడా వచ్చింది. పోలీసులు చెక్ చేస్తున్న సమయంలో అందులో భారీగా మద్యం ఉండటంతో కారును వెంటనే సీజ్ చేసారు.
రమ్యకృష్ణ కారులో అక్రమ మద్యం
రమ్యకృష్ణ కారులో అక్రమ మద్యం

డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రమ్యకృష్ణ కారులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం ఉన్నాయి. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణ పేరు మీదున్న ట‌యోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్‌07క్యూ 0099) కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో మద్యం బాటిల్స్ కనిపించాయి. చెన్నైలో మద్యం లభించపోవడంతో మహాబలిపురం నుండి మద్యం తెస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు రమ్యకృష్ణ స్పందించలేదు. కారు డ్రైవర్ సెల్వకుమార్‌కు బెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: June 13, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading