Anchor Suma: ఇంకా ఈ దుస్తులు ఏంటీ అమ్మాయ్ అంటూ యాంకర్ సుమపై సినీ నటి షాకింగ్ కామెంట్స్!

anchor Suma

Anchor Suma:  టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే స్టార్ నటీనటులకు ఉన్నంత క్రేజ్ యాంకర్ సుమకు ఉందని తెలుసు. అంతేకాకుండా యాంకరింగ్ లో ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

  • Share this:
    Anchor Suma:  టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే స్టార్ నటీనటులకు ఉన్నంత క్రేజ్ యాంకర్ సుమకు ఉందని తెలుసు. అంతేకాకుండా యాంకరింగ్ లో ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరలో ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ హోదాను అందుకుంది. వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది. కానీ బుల్లితెరపై మాత్రమే మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ షో లల్లోనే కాకుండా సినీ అవార్డు, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లలో కూడా తన హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే ఓ సీనియర్ నటి సుమ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

    సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సుమ. ఈమధ్య తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేసింది. అందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ లను అందిస్తుంది. ఇక ఇప్పటికీ పలు షో లలో బాగా బిజీగా ఉంది. ఇక తన వయసును మేకప్ తో బాగా కవర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిజానికి ఏ ఈవెంట్ లో నైనా సుమ సందడి చేస్తేనే బాగుంటుందని ప్రేక్షకులు చాలాసార్లు తెలిపారు.

    ఇక ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమవుతున్న క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్ళ నుండి ప్రసారమౌతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో సెలబ్రేట్ లను ఆహ్వానించి వాళ్లను బాగా ఆడుకుంటుంది. ఇక తాజాగా ఈ షో కి సంబంధించిన వచ్చే ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో సీనియర్ నటులు బాబు మోహన్, గౌతమ్ రాజు, రాజ్యలక్ష్మి, శివ పార్వతి లు పాల్గొన్నారు. ఇక వారితో ఎంట్రీ తోనే బాగా సందడి చేసింది సుమ.



    ఇందులో రాజలక్ష్మి ఎంట్రీతోనే సుమ పై ఓ షాకింగ్ కామెంట్ చేసింది. ముందుగా సుమ.. ఈరోజు మీరు నాకు కాంపిటీషన్ గా రెడీ అయి వచ్చారు అని రాజలక్ష్మి తో అనడంతో.. వెంటనే రాజ్యలక్ష్మి.. నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉందని కామెంట్ చేసింది. తామెప్పుడో చిన్నప్పుడు లంగావోణిలు వేసుకున్నామని.. నువ్వు మాత్రం ఇప్పటికీ వేస్తున్నావు అంటూ అనడంతో.. ఇందులో మీ అర్థం ఏంటి? ఇంత వయసు వచ్చినా కూడా లంగా వోణీలు వేసుకుంటున్నాననా.. అని సుమ అనడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: