హోమ్ /వార్తలు /సినిమా /

ఇండియాను ఇటలీ చేయొద్దు.. చస్తే శవాలు కూడా ముట్టుకోరు..

ఇండియాను ఇటలీ చేయొద్దు.. చస్తే శవాలు కూడా ముట్టుకోరు..

మీనా ఫైల్ ఫోటో (actress meena)

మీనా ఫైల్ ఫోటో (actress meena)

Meena: ఇంత సీరియస్ వార్నింగ్ ఎవరిచ్చారు అనుకుంటున్నారా..? ఇప్పుడు సినిమా వాళ్లంతా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమకు తోచిన విధంగా జనాన్ని ప్రభావితం చేస్తున్నారు.

ఇంత సీరియస్ వార్నింగ్ ఎవరిచ్చారు అనుకుంటున్నారా..? ఇప్పుడు సినిమా వాళ్లంతా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తమకు తోచిన విధంగా జనాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఇదే దారిలో సీనియర్ హీరోయిన్ మీన కూడా బయటికొచ్చి తనకు తోచింది చెప్పుకొచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమే వరకు మనమంతా కలిసే ఉండాలి.. ఎవ్వరూ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని చెబుతుంది ఈమె. అంతేకాదు.. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ను ఇంకా కొందరు సీరియస్‌గా తీసుకోకుండా రోడ్లపైకి వస్తున్నారని టీవీల్లో చూస్తుంటే బాధగా ఉందని చెప్తుంది ఈమె.

మీనా ఫైల్ ఫోటో (actress meena)
మీనా ఫైల్ ఫోటో (actress meena)

దయచేసి ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. గవర్నమెంట్ చెప్పింది వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసినందుకే ఇప్పుడు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయాయని.. కనీసం చనిపోతే శవాలు ముట్టుకోడానికి కూడా ఎవరూ రావడం లేదని చెబుతుంది మీనా. దయచేసి ఇండియాను అలా చేయొద్దని వేడుకుంటుంది.

అందరం ఇంట్లోనే ఉండి ఈ కరోనాను తరిమేయాలని.. పిల్లలతో ఆడుకోవాలని.. అలాగే ఇంట్లో అమ్మ వాళ్లకు వంటపనిలో సాయం చేయాలని.. ఇష్టమైన పుస్తకాలు చదవాలని ఆమె సలహాలు ఇస్తుంది. సినిమాలు చూసే వాళ్లు అందులో బిజీ అయిపోండని చెబుతుంది. ఏం చేసినా కూడా ఇంట్లోంచి మాత్రం కాలు బయటికి పెట్టొద్దని వేడుకుంటుంది మీనా.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Coronavirus, Meena, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు